Monday, August 10, 2015

పొట్లకాయ పెరుగు పచ్చడి

1.పొట్లకాయ 1
2.గట్టి పెరుగు(చిరు పులుపు వుంటే మంచిది) 250ml
3.అల్లం చిన్న ముక్క
4.పచ్చి మిర్చి 3
5.ఉప్పు తగినంత(రుచికి సరిపడా)
6.ఎండు మిర్చి 1 (రెండుగా తుంపి వేసుకోవచ్చును)
7.మినప పప్పు ½ టీ స్పూన్
8.ఆవాలు ¼ టీ స్పూన్
9.జీలకర్ర ¼ టీ స్పూన్
10.మెంతులు ¼ టీ స్పూన్
11.ఇంగువ చిటికెడు(సువాసన కొరకు )
12.కరివేపాకు లేదా కొతిమీర కొద్దిగా
13.నూనె 1 టీస్పూన్
తయారు చేయు విధానం:
1. పొట్లకాయను శుబ్రముగా కడిగి గుండ్రముగా తరుక్కోవాలి పైన చూపించిన చిత్రంలో మాదిరిగా.
2. తరుక్కున్న ముక్కలను ప్రెషర్ పాన్ లో తగినంత నీరు పోసి, తగినంత ఉప్పువేసి స్టవ్ పైన పెట్టుకుని మొదటి విజిల్ వచ్చేక మంట చిన్నదిగా చేసుకుని పది నిమిషాలు వుంచుకోవాలి. రెండవ విజిల్ వచ్చేక స్టవ్ ఆపేసుకోవాలి.
3. ప్రెషర్ విడుదల అయ్యేలోపున అల్లం, పచ్చిమిర్చి ని తీసుకుని మిక్సీ లో తిప్పుకోవాలి లేదా గ్రేటర్ తో కూడా గ్రేట్ చేసుకోనవచ్చును.అల్లం,పచ్చి మిర్చి ముద్దను ఈ పైన చూపిన చిత్రం లో మాదిరిగా ఒక చిన్న బౌల్ లో తీసుకోండి.
4. ఇపుడు పెరుగును ఒక బౌల్లో కి తీసుకుని స్పూన్ లేదా గరిటతో కలియబెట్టండి తొరకలు,మీగడ లేకుండా.
5. పెరుగులో తగినంత ఉప్పు వేసి, అల్లం-పచ్చి మిర్చి ముద్దను కూడా వేసి కలపండి.
6. ఈ లోగా ప్రెషర్ రిలీజ్ అయి వుంటుంది కాబట్టి పాన్ మూత తీసి ముక్కలు బైటకి తీసుకోండి.
7. ముక్కలు వేడిగా వుంటాయి కాబట్టి కొంచెం సేపు చల్లబడిన తరువాత పెరుగులో కలపండి.
8. ఒక పోపు గరిటెను తీసుకుని ఒక టీస్పూన్ నూనె వేసి పైన చెప్పిన పోపు దినుసులు వేసి వేయించుకోండి
9.వేగిన పోపును కొంచెం చల్లార్చి పెరుగులో కలపండి .పైన కొంచెం కొతిమీర తురుమును వేస్తె
సువాసనగా వుంటుంది.
వడ్డించుటకు సలహాలు మరియు ఇతరత్రా:
1. పెరుగు పచ్చడి అన్నంలోకి, అలాగే చపాతీ, పరాటాలతో కూడా రుచిగా వుంటుంది.
2. పైన వుడికిన ముక్కలు చల్లారేక పెరుగులో వేయమని చెప్పటం జరిగింది ఎందుచేతనంటే వేడి ముక్కలు వేస్తే పెరుగు విరిగినట్లుగా అయిపోతుంది
3. కొందరు కొబ్బరి తురుమును కూడా కొద్దిగా పొట్లకాయ ముక్కలతో పాటుగా పెరుగులో కలుపుతారు

0 comments:

Post a Comment