Monday, December 30, 2013

ఇడ్లీ, దోసెల కోసం కారం పొడి



కావలసిన పదార్ధాలు:


మినప్పప్పు : ఒక టీ కప్పు నిండుగా....
శనగపప్పు : అర టీ కప్పు నిండుగా....
ఎండు మిర్చి: ఆరు లేక ఎనిమిది...
మిరియాలు : ఒక టీ స్పూన్
జీలకర్ర : ఒక టీ స్పూన్
వేరుశనగ గుళ్ళు : పావు కప్పు....
కరివేపాకు: తగినంత....
ఆవాలు : అర టీ స్పూన్...
మెంతులు : పావు టీ స్పూన్
ఇంగువ : చిటికెడు..
పసుపు : చిటికెడు...
నూనె : రెండు టీ స్పూన్లు,
ఉప్పు : రుచికి సరిపడా..
తెల్ల నువ్వులు : అర కప్పు...
తయారీ విధానం:
స్టవ్ మీద బాణలి / పాన్ వేడి చేసి....ముందుగా తెల్ల నువ్వులను, నూనె లేకుండా...(Repeat: నూనె లేకుండా) కమ్మని వాసన వచ్చేంత వరకూ దోరగా వేయించి, ఓ ప్లేట్ లోకి తీసుకుని పక్కనే ఉంచుకోండి.
నెక్స్ట్ స్టెప్:
అదే బాణలి లో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత....వరుసగా...ఆవాలు, మెంతులు, ఇంగువ,మిరియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు రెబ్బలు, టక్కు, టక్కున వేస్తూ, అవి చిటపట లాడేక చిటికెడు పసుపు వేసి వెంటనే మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి అట్లకాడతో చక్కగా కలుపుతూ కమ్మని వాసన వచ్చేదాకా (కొద్దిగా రంగుమారే వరకూ) ఓ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి. స్టవ్ ఆర్పేసి మొత్తం అంతా ఓ ప్లేటులోనో, గిన్నేలోనో మార్చి చల్లార నివ్వండి. చల్లారిన తరువాత, తగినంత ఉప్పు ఆడ్ చేసి....మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయండి......
(టాల్కం పౌడర్ లా మెత్తగా పిండి చేయకండి ప్లీజ్!!!!!!....చేతికి కొద్దిగా బరకగా (బొంబాయి రవ్వలా) ఉండాలి)
ఫైనల్ గా ఓ సారి (ఎవరూ చూడకుండా కొద్దిగా టేస్ట్ చేసి) ఉప్పు సరిచూసుకొని స్టీల్/ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి....
ఈ కారం పొడిలో కాస్తంత కమ్మటి నెయ్యి వేసి ఇడ్లీ/ దోసెలతో నంచుకొని తింటుంటే....తన్మయత్వం లో పరిసరాలు మరచిపోతారు.

0 comments:

Post a Comment