Sunday, December 22, 2013

దోశ

వెన్న దోశ :- దోశ కాల్చే సమయంలో నూనెకు బదులుగా వెన్న వేసి ఎర్రగా కాల్చి చేస్తారు. హోటల్సులో వీటిని విశేషంగా తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు మరియు సాంబారు లతో దీనిని తింటారు. వడ్డన చేసే సమయంలో కూడా కొంత వెన్న దోశ మీద ఉంచి వడ్డన చేస్తారు.
కాల్చిన దోశ :- దీనిని సాధారణంగా రోస్ట్ అంటారు. ముందుగా పెనము మీద దోశను పలుచగా చేసి తరువాత దాని చుట్టూ మరియు మధ్యలో కూడా నూనెను వేసి మధ్యమమైన మంట మీద ఉంచి దానిని ఎర్రగా కాల్చి తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు మరియు సాంబారు లతో దీనిని తింటారు. హోటళ్ళలో వీటిని విశేషంగా తయారు చేస్తారు.
పాలక్ మసాలా దోశ :- స్పినాచ్ గుజ్జును పూసి వాటికి మామూలు ఉర్లగడ్డ మసాలాను చేర్చి చేసిన దోశలను పాలక్ మసాలా దోశలు అంటారు.
పనీర్ చిల్లీ దోశ :- చీజ్ లేక పనీర్ తురుముకు కొంత మసాలా పొడులను చేర్చి దానిని దోశలలో కూర్చి తయారు చేసిన దోశలను పనీర్ మసాలా దోశలు అంటారు.
చైనీస్ మసాలా దోశ :- నూడిల్స్ మరియు ఇతర చైనా పదార్ధాలు కూర్చి చేసిన దోశలను చైనా మాసాలా దోశలు అంటారు. వీటికి సాస్ మరియు స్చీజాన్ చేర్చి తయారు చేస్తారు.
కూరగాయ మసాలా దోశ :- పచ్చిబఠాణీ గింజలు ఇతర కూరగాయలు చేర్చిన మసాలాతో చేసిన మసాలాదోశలను కూరగాయల మసాలా దోశ అంటారు.
మైసూరు మసాలాదోశ :- దోశమీద మసాలా పెట్టే ముందు కొబ్బరి చట్నీ మరియు ఎర్రగడ్డ చట్నీలను పూసి తయారు చేసే మసాలా దోశలను మైసూరు మసాలా దోశలు అంటారు.
పంచ రత్న దోశ :- బియ్యపు పిండి, చనగ పిండి, మైదా పిండి, గోధుమ పిండి, రవ్వలను వంటి అయిదు విధముల పదార్ధాలను చేర్చి పెరుగు కలిపి వీటిని తయారు చేస్తారు. ఈ పిండిని పులవబెట్టవలసిన అవసరం లేదు. పుల్లని మరియు కార చట్నీలతో వీటిని అందిస్తారు.
కాలిఫ్లవర్ దోశ :- కాలిఫ్లవర్ మసాలా కూరను దోశ మధ్య చేర్చి చట్నీలతో వడ్డిస్తారు. దక్షిణ భారతీయ హోటళ్ళలో కూడా ఇవి లభిస్తాయి.
అటుకుల దోశ :- పచ్చిబియ్యం అటుకులను నానబెట్టి రుబ్బి 12 గంటల సమయం నానబెట్టి సాధారణ దోశల మాదిరి లేక మందంగా ఒక వైపు మాత్రమే కాల్చి తీస్తారు ఈ దోశలు చక్కగా ఉబ్బునట్లు ఉండి మెత్తగా ఉంటాయి. అన్ని రకాల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారతో వీటిని తిన వచ్చు.
కొబ్బరి దోశ :- పచ్చి బియ్యం పచ్చి కొబ్బరి కొంచంగా మినప పప్పు కలిపి మెత్తగా రుబ్బి పిండిని దాదాపు 12 గంటల కాలం పులవ బెట్టి సాధారణ దోశలుగా వీటిని చేస్తారు. వీటిని కారచట్నీతో తింటారు.
ఉప్పు పుళి దోశ :- దోశ పిండికి ఉప్పు, చింతపండు గుజ్జు చేర్చి తయారు చేస్తారు. వీటిని ఉడిపిలో విశేషంగా తయారు చేస్తారు.
అమెరికన్ చాప్ స్యూ దోశ :- వేయించిన నూడిల్స్ మరియు టమేటాలను దోశల మీద వేసి వీటిని తయారు చేస్తారు.
70 ఎమ్ ఎమ్ దోశ :- ఇది మసాలా దోశలా ఉంటుంది కాని ఇది చాలా పొడవుగా తయారు చేస్తారు.
నీరు దోశ :- వీటిని ఉత్తర కర్నాటక, దక్షిణ కర్నాటక మరియు మేలెనాడులలో తయారు చేస్తారు
క్యాబేజి దోశ :- వీటిని క్యాబేజితో తయారు చేస్తారు. బియ్యము, ఎండు మిరపకాయలు, ఇంగువ మరియు పసుపులతో తయారుచేసిన పిండికి సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలను చేర్చి ఒక అరగంట సమయము నానబెట్టి దోశను ఎర్రగా కాల్చి తింటారు.
సెట్ దోశ :- కర్నాటకలో ప్రబలమైన దోశ ఇది. దీని ఒక వైపు మాత్రమే కాలుస్తారు. కాల్చే సమయంలో పైన మూత పెట్టి చేసినప్పుడు ఒక వైపు మాత్రమే కల్చినా కూడా చక్కగా ఉడుకుతుంది. వీటిని ఒక సారి మూడు లేక రెండుగా వడ్డిస్తారు కనుక వీటిని సెట్ దోశ అంటారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
ఊతప్పం :- మందంగా గుండ్రంగా తయారు చేసే దోశ. దీనిని తయారు చేయడానికి పెనము మీద ముందుగా నూనె వేసి తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.

0 comments:

Post a Comment