Tuesday, January 7, 2014

క్యారెట్ గుమ్మడి హల్వా:-

క్యారెట్ గుమ్మడి హల్వా:-
క్యారెట్ కు గుమ్మడి తురుము జోడించి తయారు చేసే హాల్వా డిఫరెంట్ ఫ్లేవర్ తో పాటు అద్భుతమైన రుచి ఉంటుంది. హల్వా మన ఇండియన్ డిషెస్ లో ప్రధానమైనది. క్యారెట్, గుమ్మడి రెండింటి మిశ్రమంతో తయారుచేసే ఈ హల్వాలో ప్రోషకాంశాలు అధికంగా ఉంటాయి. ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, కె పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ హల్వా వింటర్ స్పెషల్ గా తయారుచేసుకుంటారు. ఎందుకంటే వింటర్ లో క్యారెట్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి. మరి ఈ క్యారెట్ గుమ్మడి హల్వాను ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:-
గుమ్మడికాయ తురుము: 1cup
క్యారెట్ తురుము: 1cup
పంచదార: 1cup
నెయ్యి: 1/2cup
పాలు: 1/2cup
యాలకుల పొడి: 1tsp
జీడిపప్పు: 10grm
కిస్‌మిస్:10grm
బాదం, పిస్తా: 10grm
తయారుచేయు విధానం:-
1.) ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి అది వేడెక్కాక గుమ్మడి తురుమును, క్యారెట్ తురుమును వేసి వేగించి పక్కనుంచుకోవాలి. (వేరువేరుగా వేగించుకోవాలి)
2.) అదే పాన్ లో పాలు, పంచదార వేసి లేత పాకం వచ్చేదాక బాగా ఉడికించాలి.
3.) తర్వాత అందులో ముందుగా వేగించి పెట్టుకొన్న గుమ్మడి తురుము, క్యారెట్ తురుము, నెయ్యి వేసి గరిటెతో బాగా కలుపుతూ మధ్యలో యాలకుల పొడి వేసి మళ్లీ కలపాలి.
4.) మొత్తం మిశ్రమం చిక్కబడే వరకు ఉంచి క్రింది దించేయాలి.
5.) ఒక ప్లేటులో అడుగున నెయ్యి రాసి హల్వా అందులో వేసి దానిపై జీడిపప్పు, కిస్‌మిస్, బాదం, పిస్తాను చల్లాలి. ఆరిన తర్వాత ముక్కలు కోసుకోవాలి. లేదా కప్పుల్లో వేసి అలాగే వేడి వేడిగా లేదా చల్లారిన తర్వాత తినవచ్చు. అంతే రుచికరమైన గుమ్మడి, క్యారెట్ హాల్వా రెడీ.

0 comments:

Post a Comment