Sunday, December 22, 2013

దోశ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం.

రాగి దోశ :- రాగి పిండికి నీరు కలిపి తయారు చేసే దోశ. వీటిని బీద వారి దోశ అంటారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
వెళ్ల దోశ :- పిండిలో బెల్లము వేసి నెయ్యితో తయారు చేసిన దోశ. వీటిని చెట్నీలు లేకుండా తినవచ్చు.
గోధుమ పిండి దోశ :- గోధుమ పిండికి పెరుగు చేర్చి నీటిని కూడా కలిపి పలుచగా పిండిని తయారు చేసి వీటిని తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు. గోధుమ పిండికి బెల్లము నీరు కలిపి నెయ్యి వేసి కాల్చి చేసినట్లైతే తియ్యటి దోశలు తయారు చేయవచ్చు. వీటికి చట్నీలాంటి ఆధరువులతో అవసరం లేకుండా తిన వచ్చు.
రవ్వదోశ :- వీటిని బొంబాయి రవ్వ, బియ్యపు పిండి, మైదాల మరియు పెరుగును చేర్చి వీటిని తయారు చేస్తారు. వీటిని పులవబెట్టవలసిన అవసరం లేదు. ఈ పిండిలో బియ్యపు పిండిని మాత్రము రెండు భాగాలు కలిపి చేస్తారు. ఈ పిండిలో నీరు అధికంగా చేసి పలుచగా తయారు చేసిన ఎడల పలుచని దోశలు తయారు చేయ వచ్చు. వీటిని బాగా కాల్చిన పెనం మీద పలుచగా పిండి పోసి తయారు చేసినప్పుడు చిల్లులతో దోశ చక్కగ తయారు ఉఒతుంది. వీటి మీద పలుచగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, అల్లపు ముక్కలు, కొత్త మల్లి ఆకు, ఎర్రగడ్డ ముక్కలు చల్లి కాలుస్తారు. ఈ దోశలను కొంచం పుల్లని చెట్నీలతో వడ్డిస్తారు.
కోన్ దోశ :- దోశను ఎర్రగా కాల్చి కోన్ మాదిరిగా మడిచి తయారుచేసిన దోశ. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
మెంతి దోశ :- దోశ మీద మెంతి ఆకు వేసి కాల్చి తయారు చేసే దోశ. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
పేపర్ దోశ :- పొడవుగా చాలా పలుచగా తయారు చేసి నూనెతో మరింత కాల్చి అందిస్తారు. దీనికి పెద్ద పెనము కావాలి కనుక మరియు చేయడానికి నేర్పు కావాలి కనుక వీటిని హోటళ్ళలో తయారు చేస్తారు. వీటిని మిగిలిన దోశల మాదిరి అన్ని విధముల చట్నీలు, కారపు పొడి మరియు సాంబారు లతో దీనిని తింటారు.
ఎర్రగడ్డ దోశ :- సధారణంగా ఆనియన్ దోశ అని పిలుస్తారు. ఎర్రగడ్డలను పలుచని ముక్కలుగా తరిగి దోశ మీద పరచి కాల్చి దీనిని తయారు చేస్తారు. అన్ని విధముల చట్నీలు మరియు సాంబారు లతో దీనిని తింటారు.
మసాలా దోశ :- దోశ మీద చట్నీ లేక చట్నీ పౌడర్ వేసి కాల్చి దాని మీద ఉర్లగడ్డతో చేసిన మసాలా పెట్టి మడిచి వడ్డిస్తారు వివిధ చట్నీలతో ఆహారంగా తీసుకుంటారు.

0 comments:

Post a Comment