Thursday, December 12, 2013

ముల్లంగిని తింటున్నారా?


చాలామందికి ముల్లంగి అంటే పడదు. ఆరోగ్యదృష్ట్యా - అదో రకమైన వాసన, రుచిని అందించే ముల్లంగిని ఆహారంలో ఒక భాగం చేసుకోక తప్పదు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముల్లంగిని తరచూ తురుములాగానో,
సలాడ్ రూపంలోనో లేదా సాంబారు కూరల్లోనో వేసుకు తింటే మంచిది. ముల్లంగి తినడం వల్ల శరీరానికి అధిక పొటాషియం లభిస్తుంది.
ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రత్యేకించి బీపీ ఉన్నవాళ్లకు మంచిది. మధుమేహులకూ ఉపయుక్తం. ఒక్కోసారి అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యను రాకుండా అడ్డుకునే శక్తి ఈ కూరగాయకు ఉంది. తెల్లరక్తకణాల సంఖ్యను పెంచి వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ముల్లంగి. రక్తానికి తగినంత ఆక్సిజన్‌ను అందించడం వల్ల కాలేయానికి పని భారం తగ్గుతుంది. తద్వారా కామెర్ల సమస్య దరిచేరదు. ఇక, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి ఇదొక చక్కని మందు. ముల్లంగి తింటే గొంతునొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు రావు. ఈ కూరగాయలోని గాటు వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. విటమిన్ ఎ, డి, బి-12 లతోపాటు పీచు కూడా దొరుకుతుంది.

0 comments:

Post a Comment