Wednesday, July 31, 2013

మినప జంతికలు

మినప జంతికలు :
కావలసినపదార్దాలు:
మినపప్పు : కప్పు
బియ్యప్పిండి : మూడు కప్పులు
కారం : టీ స్పూన్
నువ్వులు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
వాము : టేబుల్ స్పూన్
వెన్న : టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడ

తయారుచేయు విధానం :

1) మినపప్పు నానబెట్టి కడిగి మెత్తగా రుబ్బాలి.
2) దీనిలో ఫైన చెప్పిన వాటిలో నూనె తప్పించి మిగతా
పధార్దాలన్ని వేసి ముద్దలా కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగాక ఈ ముద్దను కొద్దిగా తీసుకోని జంతికల గొట్టంలో పెట్టి కాగె నూనెలో జంతికలా వెయ్యాలి.
5) జంతికలు రెండు ప్రక్కల దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
అంతే మినప జంతికలు రెడీ.

0 comments:

Post a Comment