Wednesday, July 31, 2013

ఆనియన్-గార్లిక్ రైతా

ఆనియన్-గార్లిక్ రైతా :
ఇండియన్ వంటకాల్లో రైతా చాలా ఫేమస్ సైడ్ డిష్. సాధారణంగా రైతాను నీళ్ళు-చిలికిన పెరుగు మిశ్రమం, కొన్ని స్పైసీ(మసాలా దినుసుల)తో తయారు చేస్తారు. రైతాకు మసాలాలను కలిపుకొని తయారు చేసుకోవచ్చు. లేదా తాజా కూరగాయలతో ఉల్లిపాయలు, టమోటోలు, కీరకాయ, అవొకాడో వంటివి మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. అంతే కాదు, బూందీ చేర్చి స్వీట్ రైతాను కూడా తయారు చేసుకోవచ్చు. రైతా స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి ఏదైనా సరే రోటీ, రైస్, పులావ్, బిర్యానీలకు బెస్ట్ కాంబినేషన్. రైతా తయారు చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఈ టేస్ట్ ను కొద్దికాలం పాటు మరచిపోలేరు. ఇది తాయారు చేయడం కూడా సులభం. మీరు కుకుంబర్ రైతాను చాలా సార్లు చేసుకొని ఉంటారు. అందుకే మసాలాదినుసులతో తయారు చేసే రైతా ఎలా ఉంటుందో మీరూ తాయారు చేసి రుచి చూడండి....

కావల్సిన పదార్థాలు:
పెరుగు: 2cups
ఉల్లిపాయలు: 1(చిన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 7-8
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
జీలకర్ర: ½tsp
బ్లాక్ సాల్ట్: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp(గార్నిషింగ్ కోసం)
నూనె: ½tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి మీడియం మంట పెట్టాలి. పాన్ వేడవ్వగానే అందులో జీలకర్ర వేసి రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి. పక్కకు తీసి చల్లారిన తర్వాత రోలింగ్ స్టోన్ మీద వేసి రోలర్ తో రుద్ది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు కొద్దిగా నీళ్ళు వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు అందులోని వేయించుకొన్న వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

3. ఇలా తయారు చేసుకొనేలోపు పాన్ లో ఒక టీస్పూన్ నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగించాలి. తర్వాత కొద్దిగా కారం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించిన తర్వాత వెంటనే ముందుగా కలిపి పెట్టుకొన్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో పోయాలి. అంతే ఉల్లిపాయ వెల్లుల్లి రైతా రెడీ. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.

0 comments:

Post a Comment