Friday, July 12, 2013

ఆలూ చెక్కలు



కావల్సినవి:
బంగాళాదుంపలు- నాలుగు, బియ్యంపిండి- రెండు కప్పులు, మొక్కజొన్న పిండి- అరకప్పు, వంటసోడా- చిటికెడు, నువ్వులు- ఆరు చెంచాలు, పచ్చిమిర్చి- ఐదు, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, వెల్లుల్లి రేకలు - ఆరు, ఉప్పు- రుచికి తగినంత, ధనియాల పొడి- రెండు చెంచాలు, కొత్తిమీర, పుదీన - కట్ట చొప్పున, కరివేపాకు- కొద్దిగా, జీలకర్ర- చెంచా, ఉల్లికాడల తరుగు- అరకప్పు.
తయారీ:
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి చల్లారాక పొట్టుతీసి చేత్తో మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలను మెత్తగా ముద్ద చేసుకోవాలి. గిన్నెలోకి బంగాళాదుంప మిశ్రమం, పచ్చిమిర్చి ముద్ద, బియ్యంపిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, ధనియాలపొడి, జీలకర్ర, నువ్వులు, వంటసోడా, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకొని నీళ్లు చేర్చకుండా గట్టిగా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక పిండిని ఉండలా చేసి చేత్తో అదిమి వేయాలి. బాగా వేగాక తీస్తే కరకరలాడే ఆలూ చెక్కలు సిద్ధమయినట్టే.
ఒకసారి ట్రై చెయ్యండి ..

0 comments:

Post a Comment