Friday, July 12, 2013

(బహుళ ధాన్యాలు) పిండి



ఒక కెజి బియ్యం తింటే వచ్చే బలం కేవలం ఒక్క నూట ముప్పయ్ గ్రాముల గోధుమలు తింటే వస్తుందన్నమాట. 
అన్నిటికన్నా మంచి పొషకవిలువలు గలిగినది మల్టి గ్రైన్ (బహుళ ధాన్యాలు) పిండి. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లి, సోయా బీన్స్, మొక్క జొన్నలు, కొర్రలు .. ఇవే కాకుండా ఇంకా బాదం పప్పు, జీడి పప్పు ... ఇలా అన్ని కలిపి పిండి చేసుకుని జావ లాగా తయారు చెసుకుని రోజూ ఏదో ఒక సమయం లో తాగుతూ ఉంటే .. పోషకాహార సమస్యలెమీ తలెత్తవు..ఇంకా ఇది తీసుకున్నవారు చాలా ఆరొగ్యం గా ఉంటారు.

ఈ బహుళ ధాన్యాల పిండి బయట చాలా కంపనీలు తయారు చేసి అమ్ముతున్నారు..కానీ స్వయం గా చెసుకుంటే చాలా మంచిది. పిల్లల ఎదుగుదలలో ఈ పిండి చాలా ఉపయోగపడుతుంది.
గోధుమలు -- 1 కెజి
రాగులు -- 1 కెజి
జొన్నలు -- 1 కెజి
సజ్జలు -- 1 కెజి
బార్లి -- 1 కెజి
మొక్క జొన్నలు -- 1 కెజి
సోయా బీన్స్ -- 250 గ్రాములు

అన్నిటిని, శుభ్రముగా కడిగి, పొట్టు ఉంటే తీసేసి .. కలిపి పిండి కొట్టించాలి.
సోయా బీన్స్ లో ఎక్కువ పొషకాలుంటాయి..కాని అవి ఎక్కువ కలిపితే చేదుగా ఉంటుంది.
అందువల్ల 250 గ్రాములు చాలు.

పయిన చెప్పిన ఏడు ఖచితంగా ఉండాలి. ఇంకా
అలసందలు -- 1 కెజి
అల్మండ్స్ -- 100 గ్రాములు
జీడిపప్పు -- 250 గ్రాములు
బాదం పప్పు -- 250 గ్రాములు
పిస్తా పప్పు -- 250 గ్రాములు

పిండి గా చేసి కలుపుకోవచ్చు .

ఈ పిండిని, నీళ్ళలో చాలా సేపు తిప్పి పేస్టు లా అయ్యాక జావ తయారు చేసుకోవాలి. లేకపోతే ఉండలు ఉండలు గా అవుతుంది.

ఇది రోజూ తీస్కుంటే మాత్రం ఇక మందులు వాడాల్సిన పని ఉండదు.

0 comments:

Post a Comment