Wednesday, July 31, 2013

బ్రేడ్ ఉప్మా

ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ గానీ, చపాతీ లు గానీ ఎక్సెస్ గా మిగిలిపోతే పారెయ్యకండి....(అంటే రాత్రికి మిగిలిపోతే మరునాడు ఉదయానికి చేసుకోవచ్చు - అంతేగాని ఎక్కువరోజులు నిలవుంచినవి కావు)

కావాల్సిన పదార్ధాలు:

బ్రేడ్ లేక చపాతీలు : చిన్న...చిన్న ముక్కలుగా తుంచుకోవాలి,

ఉల్లిపాయ: మీడియం సైజు: ఒకటి కట్ చేసి ముక్కలు చేయండి,
పచ్చి మిర్చి: రెండు,
కరేపాకు: కొద్దిగా...

పోపుకోసం;

నూనె: రెండు లేక మూడు చెంచాలు...

జీలకర్ర: అర టీ స్పూన్...
చిటికెడు : పసుపు, ఇంగువ....
ఉప్పు: రుచికి సరిపడా...
(బీ కేర్ ఫుల్: బ్రేడ్ మరియూ చపాతి ల్లో సాల్ట్ ఉండనే ఉంటుంది...అందుకని చిటికెడు...అంతకు కొంచెం ఎక్కువా....అంతే.....)

ఎలా చెయ్యాలి?

స్టవ్ మీద కొచెం విశాలంగా ఉన్న బాణలి పెట్టి వేడి చేయండి...

నూనె పోసి అది కాగిన తరువాత, జీలకర్ర, చిటికెడు ఇంగువ, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరేపాకు వేసి ఓ రెండు నిమిషాల పాటు ఫ్రీ చేయండి....ఇప్పుడు...చిటికెడు పసుపు, చిఉతికెడు ఉప్పు వేసి, ముక్కలుగా చేసిన బ్రేడ్ లేదా చపాతీ లను జత చేసి గరిటె తో బాగా కలియ తిప్పండి....ఆపై కొద్దిగా నీళ్ళను చిలకరించండి.....అంతే ఓ ఐదు నిమిషాల పాటు, స్టవ్ లో ఫ్లేం లో ఉంచి...అప్పుడప్పుడూ గరిటె తో కలుపుతూ ఉండండి....

ఇప్పుడు బ్రేడ్ ఉప్మాను ప్లేట్లల్లో సర్ది.....కొత్తిమీర తో డెకరేట్ చేయండి....వేడిగా తింటే...ఆహా ఏమి రుచి!!!!!

0 comments:

Post a Comment