Thursday, July 11, 2013

రవ్వ ఇడ్లీ:--

రవ్వ ఇడ్లీ:--

కావలసిన పదార్థాలు:--
బొంబాయి రవ్వ -- 1/4 కేజీ
అల్లం పేస్టు -- 1 స్పూన్
పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు -- రుచికి తగినంత
చిక్కటి పెరుగు -- 3 కప్పులు
కరివేపాకురెబ్బలు -- 4
పోపు సామాన్లు -- కొద్దిగా
నెయ్యి -- కొంచెంగా

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, 2 స్పూన్స్ నెయ్యివేసి, కరిగాక, బొంబాయి రవ్వను వేసి, మాడకుండా సన్నని మంటపై గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలో వేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో, పోపు వేసుకొని, అందులో అల్లం-- పచ్చిమిర్చి పేస్ట్లు , కరివేపాకు, పెరుగు వేసి, అందులోనే వేయించి పక్కనపెట్టుకున్న రవ్వను కూడా వేసి, బాగా కలియపెట్టి 2 నిముషాలు ఉంచి దించి పక్కనపెట్టుకోవాలి.

చల్లారిన తరవాత ఇడ్లీస్టాండ్ తీసుకొని, నూనె రాసుకొని, ఆ రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని, కుక్కర్ లో పెట్టి, స్టవ్ వెలిగించి, కుక్కరు పెట్టి, 15 నిముషాలు ఉంచితే ఇడ్లీలు రెడీ. అంతే వేడి - వేడి రవ్వ ఇడ్లీలు మీ ముందు సిద్దం. ఈ వేడి-- వేడి ఇడ్లీలలను కొబ్బరి చట్నీతో తింటే చాలా బావుంటుంది. లేదా మనకి ఇష్టమైన చట్నీలతో తినొచ్చును.

ఈ రవ్వ ఇడ్లీలు చేసుకోవటం చాలా సులువు. పప్పు నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం వంటి ఇబ్బందులు పడకుండాఉంటాము. మనకి అర్జెంటుగా ఇడ్లీలు కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చును.

0 comments:

Post a Comment