Wednesday, July 17, 2013

పూరీలు



 
కావలసిన పదార్థాలు:-- గోధుమపిండి -- 1/4 కేజీ బొంబాయి రవ్వ -- 2 స్పూన్స్ పాలు -- 1 కప్పు నెయ్యి -- 1 స్పూన్ ఉప్పు -- తగినంత నూనె -- 1/2 కేజీ
తయారీ విధానం:--
ముందుగా గోధుమపిండిని బాగుచేసుకొని, పైనచెప్పిన పదార్థాలు అన్నీ వేసి, తగినంత నీరు పోసుకుంటూ, బాగా కలిపి, అరగంట నానబెట్టాలి. పిండి నానిన తరవాత బాగా మదాయించి, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పూరీలు వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, వేడి అయ్యాక ఒక్కొక్క పూరీని వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక ప్లేట్ లో అమర్చుకోవాలి. పూరీలను ఎప్పుడూ విడి - విడిగా పేర్చుకోవాలి, ఒకదానిపై ఒకటి పెట్టకూడదు, అలా పెడితే మెత్తబడతాయి. బొంబాయి రవ్వ వెయ్యటంతో కొంచెం కరకరలాడుతూ (క్రిస్పీగా) ఉంటాయి. అంతే వేడి వేడి పూరీలు రెడీ. మనకి నచ్చిన కూర లేదా సాంబార్ తో తినొచ్చును.

0 comments:

Post a Comment