Wednesday, July 31, 2013

ఉప్పుడు పిండి

ఉప్పుడు పిండి

కావాల్సిన పదార్ధాలు

బియ్యం రవ్వ -- ఒకటిన్నర గ్లాసు
అల్లం -- అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు -- 14
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్
సెనగ పప్పు -- ఒక టేబుల్ స్పూన్
మినప పప్పు -- అర టేబుల్ స్పూన్
ఆవాలు -- అర టీ స్పూన్
జీలకర్ర -- ఒక టీ స్పూన్
కరివేపాకు -- రెండు రెమ్మలు
జీడిపప్పు -- 14 పప్పులు
నూనే -- ఒక గరిటెడు
నెయ్యి -- ఒక టేబుల్ స్పూన్
నీళ్ళు -- 3గ్లాసులు

తయారు చేసే విధానం ;-

ముందుగ అల్లం,పచ్చిమిరపకాయలను బాగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.తరవాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనే ,నెయ్యి వేసి సెనగ పప్పు,మినప పప్పు,ఆవాలు,జీలకర్ర ,జీడిపప్పు ను బద్దలుగా విడతీసి వెయ్యాలి.పోపు దోరగా వేగాక అల్లం,పచ్చిమిరప ముద్దను వేసి కరివేపాకును వేసి ఉప్పు కూడా వేసి ఒక ఐదు నిముషాలు వుంచి 3గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు మరగ నివ్వాలి.బుడగలు వచ్చే వరకు.ఇప్పుడు మరుగుతున్న ఎసరులో బియ్యపు రవ్వను పోసి గరిట తో బాగా కలిపి మూత పెట్టాలి.ఒక ఐదు నిముషాల తరువాత బాగా కలిపి ఉప్మాను కిందకు దించేయాలి స్టవ్ మీద నుంచి.అంతే ఘుమఘుమ లాడే రుచికరమైన ఉప్పుడు పిండి (బియ్యపు రవ్వ ఉప్మా ) రెడీ.

0 comments:

Post a Comment