Tuesday, February 16, 2016

• రాగిపిండితో... వూతప్పం

కావల్సినవి: మినప్పప్పు - పావుగ్లాసు, బియ్యం - అరగ్లాసు, రాగిపిండి - గ్లాసు, తురిమిన కొబ్బరి - అరకప్పు, గసగసాలు - రెండు చెంచాలు, జీడిపప్పు - పది, కిస్‌మిస్‌ - ఇరవై, చక్కెర - మూడు చెంచాలు, బాదం, పిస్తా పలుకులు - కొన్ని, యాలకులపొడి - పావుచెంచా, నెయ్యి - అరకప్పు, ఉప్పు - చిటికెడు.

తయారీ: బియ్యం, మినప్పప్పును ఓ గిన్నెలో తీసుకుని సరిపడా నీళ్లు పోసి కొన్నిగంటలసేపు నానబెట్టుకోవాలి. తరవాత మెత్తగా రుబ్బుకుని అందులో రాగిపిండి కూడా వేసి కలిపి ఎనిమిది గంటలు పులియబెట్టాలి. ఇందులో ఉప్పూ, చక్కెరా, యాలకులపొడీ, కొబ్బరి తురుమూ, గసగసాలు వేసి బాగా కలపాలి. పొయ్యిమీద పెనం పెట్టి.. నెయ్యి రాసి ఈ పిండిని వూతప్పంలా నెరిపి పైన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేసి మూత పెట్టేయాలి. ఎర్రగా కాలాక తీసేయాలి. ఇది తియ్యగానే కాదు, రుచిగానూ ఉంటుంది. ఈ వూతప్పం శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

0 comments:

Post a Comment