Sunday, February 14, 2016

* మెంతి క్రిస్పీస్‌

• కావలసినవి
సెనగపిండి: 2 కప్పులు, బేకింగ్‌సోడా: పావుటీస్పూను, వాము: పావుటీస్పూను, పసుపు: పావుటీస్పూను, నూనె: టేబుల్‌స్పూను, క్యారెట్‌ తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లంతురుము: టీస్పూను, మెంతితురుము: కప్పు, మజ్జిగ: కలిపేందుకు సరిపడా, పంచదార: టీస్పూను, ఉప్పు: సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా

• తయారుచేసే విధానం

* సెనగపిండిలో బేకింగ్‌సోడా, వాము, పసుపు, నూనె, క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి, అల్లంతురుము, మెంతి తురుము, పంచదార, ఉప్పు అన్నీ వేసి కలపాలి. తరవాత తగినంత మజ్జిగ పోసి చపాతీ పిండిలా కలపాలి.
* పిండిముద్దను అంగుళం మందంతో చపాతీలా చేసి సన్నగా పొడవు ముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె పోసి ఈ ముక్కలు వేసి ఎర్రగా వేయించి తీయాలి.

0 comments:

Post a Comment