అటుకుల ఉప్మా ఆరోగ్యానికి మంచిది..బొంబాయి రవ్వ ఉప్మా కి ఆయిల్/ నెయ్యి
ఎక్కువగా ఉపయోగించాలి. పైగా అది ఎక్కువ శుద్ధి చేసినది (రిఫైండ్ )అవడం వల్ల
ఆరోగ్యానికి మంచిది కాదు..అటుకులు (మరీ తెల్లగా ,పల్చగా వున్నవి కాకుండా
దొడ్డు అటుకులు వాడాలి )ధాన్యం నుండి తయారు అవుతాయి..అందులోని ముడిబియ్యం
వల్ల విటమిన్లను కోల్పోదు. త్వరగా పూర్తి అయ్యే వంట. రుచికరం
కూడా..ఉపవాసాల్లో కూడా వాడుకోతగ్గ , ఉపాహారం ఇది.
కావలసిన పదార్ధాలు :
1.అటుకులు 200 గ్రా., 2.అల్లంముక్కలు, 3.పచ్చిమిర్చి ముక్కలు
,4.కరివేపాకు,కొత్తిమిర , 5.జీడిపప్పు/పల్లీలు , 6. పోపుదినుసులు,
7.కారట్+బీన్స్+ ఆలూ +పచ్చిబటానీ+ఉల్లితరుగు (ఇవి కావాలనుకొంటే వేసుకోవచ్చు
), 9 .పల్లీలు + పుట్నాల పొడి 2 sp., 10. ఆయిల్.
చేయువిధానం : ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని, 2
సార్లు కడిగి , నీరు వంచి ,పెట్టుకోవాలి.పాన్ వేడి చేసి ,నూనె వేసి
పోపుదినుసులు (శనగపప్పు+ మినపప్పు+ ఆవాలు+ జీలకర్ర ) వేసి ,వేగినతరువాత
జీడిపప్పు /పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం ,పచ్చిమిర్చి
ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరువాత కూరగాయ ముక్కలు కూడా వేసి ,కొంచం సేపు
మగ్గనివ్వాలి.తరవాత ఉప్పు + పసుపు వేసి, అటుకులు కూడా కలపాలి.బాగా కలిపి
,కొంచం ముద్దగా కావాలనుకొంటే పావు కప్పు నీరు కలుపుకోవచ్చు..లేదా
పొడిపొడిగా కావాలనుకుంటే అలాగే వుంచి ఇష్టమైతే 2 sp పల్లీలపొడి ,2 sp .
నిమ్మరసం వేసుకొని కొత్తిమిర జల్లితే వేడి వేడి అతుకుల ఉప్మా రెడీ..అన్నీ
రెడీగా వుంటే 6 ,7 నిముషాలకన్నా ఎక్కువ సమయం పట్టదు మరి..:)
Sunday, May 25, 2014
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment