కావలసినవి: కొంచెం పుట్నాలపప్పు, అల్లంముక్క, ఎర్రకారం, కరివేపాకు, తీపికి సరిపడ బెల్లం, ఉప్పు, నానబెట్టిన చింతపండు.
తయారు చేసే విధానం:
చిన్న మిక్సీగిన్నెలో పుట్నాలపప్పు, అల్లంముక్క, ఎర్రకారం, కరివేపాకు,
ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి. తరువాత నానబిట్టిన చింతపండు, బెల్లంపొడి,
నీళ్ళు పోసి మళ్ళీ తిప్పాలి. తీపి, పులుపు మీకు తగినట్లుగా వేసుకోండి.
ఈ చట్నీ ఇడ్లి, దోసెల్లోకి, పెసరట్లలోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఎర్రకారం బదులు పచ్చిమిరపకాయలు వేసి కూడా చెయ్యచ్చు.
very nice content. thanks for sharing
ReplyDeletehttp://karyesh.com/