Friday, May 2, 2014

పెసరకట్టు : అన్నం కుక్కర్ లోనే కాస్తంత పెసరపప్పు నీళ్ళు పోసి పెట్టాలి. కుక్కర్ మూత రాగానే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు పోపు వేసి, ఉప్పు కలిపేస్తే సరిపోతుంది. మంచి చలవ చేసే పెసరకట్టుకు సరైన కాంబినేషన్ 'మెంతికాయ, మాగాయ, లేక ఆవకాయ...'.
మాగాయ పప్పు : కుక్కర్ లో కందిపప్పు పెట్టాలి. పప్పు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి, అందులో కాస్త మాగాయ పచ్చడి వేసి, పప్పు వేసి కలిపెయ్యాలి. ఇది మామిడికాయ పప్పు లాగా ఉంటుందండోయ్...
కారెట్ కూర : కారెట్ సాధారణంగా ఉడకడానికి సమయం తీసుకుంటుంది. అయితే, కారెట్ తురిమి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కర్వేపాకు వేసిన పోపులో వేసి, చివరగా ఉప్పు కలిపి, తీసేస్తే ఆ రుచి అద్భుతః. ఈ కూరకు ఐదు నిముషాల కంటే ఎక్కువ సేపు పట్టదోచ్... ప్రయత్నించండి...

0 comments:

Post a Comment