Sunday, May 25, 2014

బట్టర్ నాన్

కావలసిన పదార్ధాలు : మైదా 2 కప్పులు ; వెన్న 100 గ్రా.; ఈస్ట్ 1 sp ,
పంచదార 1 sp ; ఉప్పు 1 sp ;బేకింగ్ సోడా 1 sp ; ఆయిల్ 2 tsp;
పెరుగు 2 tsp ; వేడినీళ్ళు 1 కప్పు.
ఇక్కడ sp అంటే చిన్న స్పూన్.tsp అంటే పెద్ద స్పూన్ అని అర్ధం చేసుకోండి .
చేయువిధానం : ఒక చిన్న బౌల్ లో వేడినీరు ,ఈస్ట్ ,పంచదార తీసుకొని బాగాకలపాలి . మరో పెద్ద బౌల్ లో మైదా ,ఉప్పు ,బేకింగ్ సోడా , ఆయిల్ వేసి బాగాకలిపి, దానికి పెరుగు కూడా కలిపి ,తరువాత ఈస్ట్ కలిపిన వేడినీళ్ళు పోసి బాగాకలపాలి.మరీ గట్టిగా కాకుండా , మృదువుగా ఉండేలా చూడాలి. ఆ బౌల్ మీదఒక తడి బట్ట వేసి 4 గంటలు పక్కన ఉంచాలి.పిండి బాగా ఉబ్బి, డబుల్ అవుతుంది.మళ్ళీ పిండిని బాగా కలిపి 6 / 7 సమాన భాగాలుగా చేసుకోవాలి .కొంచంపెద్దగానే చేసుకోవాలి ఉండలు. ఇప్పుడు పొడిమైదా పిండితీసుకొని , పీటమీదచల్లుకొని ,మైదా ముద్దను పెట్టి పొడుగ్గా వత్తుకోవాలి.చేతులకు ,పీటకు ,కర్రకు కొద్దిగా ఆయిల్ రాసుకొంటే అంటుకోకుండా వుంటుంది. చపాతీకిబట్టర్ రాసి మధ్యకు మడవాలి.మళ్ళీ వత్తి , మళ్ళీ బట్టర్ రాసి త్రిభుజాకారం ,లేదా ఓవల్ షేప్..మీకు నచ్చే ఆకారానికి మడిచి మందంగా వత్తుకోవాలిమందపాటి ఇనుప పెనం(హాండిల్ తో వున్నది ) వీటికి బావుంటుంది.పెనం వేడిఅయ్యాక నాన్ కి ఒకవైపు నీటి తడి రాసి ,తడిగా వున్నవైపు పెనం మీదవెయ్యాలి.ఇలాచెయ్యడం వల్ల ,నాన్ పెనానికి అతుక్కొని వుంటుంది. చేత్తో కూడాపైపైన వత్తి ,పెనం తో సహా తిరగేసి ,మంట రోటీకి తగిలేలాగా కాల్చాలి.చక్కగాపొంగుతుంది. మాడకుండా చూసుకోవాలి.ఇది కష్టం అనుకుంటే మార్కెట్లో పుల్కాలు కాల్చుకొనే గ్రిల్ దొరుకుతుంది . దానిమీద రెండు వైపులాకాల్చుకోవాలి . బట్టర్ కొద్దిగా కరిగించి , బ్రష్ తో గానీ ,స్పూన్ తో గానీ నాన్ కిరెండు వైపులా రాసి ,వేడిగా సర్వ్ చేయాలి.

0 comments:

Post a Comment