కావలసిన పదార్థాలు
ఒక గ్లాసు ఉప్మారవ్వ
పండిన టమోటాలు 3
ఉల్లిపాయ 1
అల్లం
పచ్చిమిర్చి, లేక ఒక స్పూను కారం
2 స్పూన్లు నెయ్యి
కరివేపాకు
కొత్తిమీర
MTR సాంబారు పొడి
నాలుగు బీన్సు (చిన్న ముక్కలు), లేక పచ్చి బటానీలు
జీడిపప్పు, శనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు
తయారు చేయు విధానము
బాణలిలో నూనె వేసి పోపుగింజలు వేగాక కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి
వేసి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి వేగాక నీళ్ళు పోయాలి. నీళ్ళు బాగా మరిగాక,
తగినంత ఉప్పు వేసి, MTR సాంబారు పొడి 3 స్పూనులు వేసి, తరవాత బొంబాయి రవ్వ
మెల్లగా పోస్తూ కలియపెట్టాలి. మూత పెట్టి కాసేపయాక, నెయ్యి, కొత్తిమీర
జల్లి కలియపెట్టాలి. ఇలా చేసి చూడండి. చాలా రుచిగా వుంటుంది.
ముఖ్య గమనిక
టమోటాబాత్ కి MTR సాంబారుపొడి, పోపులో జీలకర్ర వేస్తేనే రుచిగా
వుంటుంది. నూనె పల్లీనూనె ఐతేనే రుచిగా వుంటింది. నూనె కూడా సరిపడా
వెయ్యాలి. లేకపోతే ఉప్మా ఉండలు కడ్తుంది. ప్లేటులో పెట్టేటప్పుడు పులుసు
గరిటతో నొక్కి వేస్తే ఇడ్లీ షేపు వస్తుంది. ఈ టమోటాబాత్ ఓట్సుతో కూడా
చెయ్యచ్చు.
Friday, May 9, 2014
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment