Friday, January 24, 2014

మేతి ముతియా

మేతి ముతీయా గుజరాత్ వంటల్లో చాలా ప్రసిద్ది చెందినటువంటి రిసిపి. ఈ ట్రెడిషినల్ గుజరాత్ రిసిపి జనరల్ వెజిటేరియన్ డిష్ మరియు ఇది అధిక న్యూట్రీషియన్స్ కలిగినటువంటి డిష్.
మెంతి ఆకులు ఒక మూలికలు వంటిది. దీన్ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తుంటారు. మేతి ముతియా విటమిన్ ఎ, ఐరన్ మరియు క్యాల్షియం అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి ఈ డిష్ నిజంగా ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు:
మెంతి ఆకులు 1 కప్ (తరిగిన)
గోధుమ పిండి 1/3 కప్
శెనగ పిండి 1/3 కప్
అల్లం వెల్లుల్లి పేస్ట్ ½ స్పూన్
పసుపు: ¼ tsp
గరం మసాలా ¼ tsp
మిరియాలు ¼ tsp
పంచదార: 1tsp
నిమ్మరసం: 1tsp నూనె - 1tsp
ఉప్పు
తయారుచేయు విధానం:
1. ముందుగా మెంతి ఆకులను విడిపించి, శుభ్రంగా కడిగి, తేమ ఆరే వరకూ పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో మెంతి ఆకులు, గోధుమ పిండి, శెనగపిండి, అల్లం, వెల్లుల్లిపేస్ట్ ,పసుపు, గరం మసాలా పంచదార, పెప్పర్ పౌడర్ లేదా మిరియాలు కొద్దిగా, నిమ్మరసం, ఉప్పు వేసి మ్రుదువుగా కలుపుకోవాలి. నీరుపోసి, మొత్తం మిశ్రమాన్ని మ్రుదువుగా కలుపుకోవాలి.
2. కలిపిన తర్వాత పిండిని 5నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. 5 నిముషాల తర్వాత మొత్తం పిండిలో 12-14బాల్స్ ను తాయరుచేసుకోవాలి.
4. ఇప్పుడు ఓవెన్ ను 200డిగ్రీ సంటీగ్రేడ్ లో (400ఫారెన్ హీట్ లో)సెట్ చేసుకోవాలి.
5. ఓవెన్ లో ప్రీహీట్ ట్రేకు కొద్దిగా నూనె రాసి, ఇప్పుడు అందులో ముందుగా తయారుచేసుకొన్న మేతి బాల్స్ అందులో పెట్టాలి.
6. వాటిలో 7-8నిముషాలు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి.
అంతే మేతి ముతియా రెడీ. దీన్ని టమోటో సాస్ లేదా చట్నీతో సర్వ్ చేయండి.

0 comments:

Post a Comment