Wednesday, January 8, 2014

వంకాయ వేరుశెనగపప్పు మసాల

వంకాయలు - 5
వేరుశెనగపప్పు - 25 గింజలు
ఆవాలు - 1 teaspoon
జీర - 1 teaspoon
వెల్లుల్లి - 5 - 6
ఎండు కొబ్బరి - 3 - 4 pieces
ఎండు మిరపకాయలు - 4
ఉల్లిపాయలు - 2
చింతపండు - 2 నిమ్మకాయంత balls
ఉప్పు
పసుపు
ముందుగ వేరుశెనగపప్పు ని బాండలి లో వేయిన్చోకవాలి. వేరే pan లో ఒక teaspoon నూనె వేసుకొని ఆవాలు, జీర, ఎండు మిరపకాయలు వేయించుకోవాలి.
తర్వాత grinder లో వేయించు కొన్నవన్ని వేసుకొని, వెల్లుల్లి రెప్పలు, కొబ్బరి వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని పేస్టు చేసుకోవాలి.
వేరే బాండలి లో నూనె పోసుకొని కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేయించుకోవాలి. తర్వాత తరిగిన వంకాయ ముక్కలని వేసి వేయించుకోవాలి. 5 నిముషాలు తర్వాత చేసుకొన్నా పేస్టు ని కూడా వేసి fry చేసుకోవాలి.
చిటికెడు పసుపు, ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి.
ఈ లోపు చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. రసం చిక్కగా ఉండాలి.
చింతపండు రసాన్ని కూడా వేసి ఉడక పెట్టుకోవాలి .
అంతే వంకాయ వేరుశెనగపప్పు గ్రేవి రెడీ

0 comments:

Post a Comment