Sunday, January 26, 2014

క్యాప్సికం మసాలా రైస్


కావలసిన పదార్థాలు: పొడి అన్నం - 3 కప్పులు, నూనె - ఒకటిన్నర స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, క్యాప్సికం (పెద్దవి) - 2, ఉప్పు - రుచికి తగినంత, పచ్చికొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి - 4, దనియాలు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, మినపప్పు - 1 టీ స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క, వేగించిన వేరుశనగలు - 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:
నెయ్యిలో జీలకర్ర, మినపప్పు, దనియాలు, ఎండుమిర్చి, దాల్చినచెక్క, కొద్దిగా కరివేపాకు వేగించి చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగలతో పాటు పొడి చేసుకుని పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేగించి క్యాప్సికం ముక్కలతో పాటు ఉప్పు కలపాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత అన్నం, మసాల పొడి, మిగిలిన వేరుశనగలు, కొబ్బరి తురుము కలిపి వేడి వేడిగా తినాలి.
రైతా/ ఊరగాయ/ అప్పడం మంచి కాంబినేషన్.

0 comments:

Post a Comment