Sunday, May 25, 2014

అటుకుల ఉప్మా (పోహా )

అటుకుల ఉప్మా ఆరోగ్యానికి మంచిది..బొంబాయి రవ్వ ఉప్మా కి ఆయిల్/ నెయ్యి ఎక్కువగా ఉపయోగించాలి. పైగా అది ఎక్కువ శుద్ధి చేసినది (రిఫైండ్ )అవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు..అటుకులు (మరీ తెల్లగా ,పల్చగా వున్నవి కాకుండా దొడ్డు అటుకులు వాడాలి )ధాన్యం నుండి తయారు అవుతాయి..అందులోని ముడిబియ్యం వల్ల విటమిన్లను కోల్పోదు. త్వరగా పూర్తి అయ్యే వంట. రుచికరం కూడా..ఉపవాసాల్లో కూడా వాడుకోతగ్గ , ఉపాహారం ఇది.
కావలసిన పదార్ధాలు :
1.అటుకులు 200 గ్రా., 2.అల్లంముక్కలు, 3.పచ్చిమిర్చి ముక్కలు ,4.కరివేపాకు,కొత్తిమిర , 5.జీడిపప్పు/పల్లీలు  , 6. పోపుదినుసులు, 7.కారట్+బీన్స్+ ఆలూ +పచ్చిబటానీ+ఉల్లితరుగు (ఇవి కావాలనుకొంటే వేసుకోవచ్చు ), 9 .పల్లీలు + పుట్నాల పొడి 2 sp., 10. ఆయిల్.
చేయువిధానం : ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని, 2 సార్లు కడిగి , నీరు వంచి ,పెట్టుకోవాలి.పాన్ వేడి చేసి ,నూనె వేసి పోపుదినుసులు (శనగపప్పు+ మినపప్పు+ ఆవాలు+ జీలకర్ర ) వేసి ,వేగినతరువాత జీడిపప్పు /పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం ,పచ్చిమిర్చి ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరువాత కూరగాయ ముక్కలు కూడా వేసి ,కొంచం సేపు మగ్గనివ్వాలి.తరవాత ఉప్పు + పసుపు వేసి, అటుకులు కూడా కలపాలి.బాగా కలిపి ,కొంచం ముద్దగా కావాలనుకొంటే పావు కప్పు నీరు కలుపుకోవచ్చు..లేదా పొడిపొడిగా కావాలనుకుంటే అలాగే వుంచి ఇష్టమైతే 2 sp పల్లీలపొడి ,2 sp . నిమ్మరసం వేసుకొని కొత్తిమిర జల్లితే వేడి వేడి అతుకుల ఉప్మా రెడీ..అన్నీ రెడీగా వుంటే 6 ,7 నిముషాలకన్నా ఎక్కువ సమయం పట్టదు మరి..:)

బట్టర్ నాన్

కావలసిన పదార్ధాలు : మైదా 2 కప్పులు ; వెన్న 100 గ్రా.; ఈస్ట్ 1 sp ,
పంచదార 1 sp ; ఉప్పు 1 sp ;బేకింగ్ సోడా 1 sp ; ఆయిల్ 2 tsp;
పెరుగు 2 tsp ; వేడినీళ్ళు 1 కప్పు.
ఇక్కడ sp అంటే చిన్న స్పూన్.tsp అంటే పెద్ద స్పూన్ అని అర్ధం చేసుకోండి .
చేయువిధానం : ఒక చిన్న బౌల్ లో వేడినీరు ,ఈస్ట్ ,పంచదార తీసుకొని బాగాకలపాలి . మరో పెద్ద బౌల్ లో మైదా ,ఉప్పు ,బేకింగ్ సోడా , ఆయిల్ వేసి బాగాకలిపి, దానికి పెరుగు కూడా కలిపి ,తరువాత ఈస్ట్ కలిపిన వేడినీళ్ళు పోసి బాగాకలపాలి.మరీ గట్టిగా కాకుండా , మృదువుగా ఉండేలా చూడాలి. ఆ బౌల్ మీదఒక తడి బట్ట వేసి 4 గంటలు పక్కన ఉంచాలి.పిండి బాగా ఉబ్బి, డబుల్ అవుతుంది.మళ్ళీ పిండిని బాగా కలిపి 6 / 7 సమాన భాగాలుగా చేసుకోవాలి .కొంచంపెద్దగానే చేసుకోవాలి ఉండలు. ఇప్పుడు పొడిమైదా పిండితీసుకొని , పీటమీదచల్లుకొని ,మైదా ముద్దను పెట్టి పొడుగ్గా వత్తుకోవాలి.చేతులకు ,పీటకు ,కర్రకు కొద్దిగా ఆయిల్ రాసుకొంటే అంటుకోకుండా వుంటుంది. చపాతీకిబట్టర్ రాసి మధ్యకు మడవాలి.మళ్ళీ వత్తి , మళ్ళీ బట్టర్ రాసి త్రిభుజాకారం ,లేదా ఓవల్ షేప్..మీకు నచ్చే ఆకారానికి మడిచి మందంగా వత్తుకోవాలిమందపాటి ఇనుప పెనం(హాండిల్ తో వున్నది ) వీటికి బావుంటుంది.పెనం వేడిఅయ్యాక నాన్ కి ఒకవైపు నీటి తడి రాసి ,తడిగా వున్నవైపు పెనం మీదవెయ్యాలి.ఇలాచెయ్యడం వల్ల ,నాన్ పెనానికి అతుక్కొని వుంటుంది. చేత్తో కూడాపైపైన వత్తి ,పెనం తో సహా తిరగేసి ,మంట రోటీకి తగిలేలాగా కాల్చాలి.చక్కగాపొంగుతుంది. మాడకుండా చూసుకోవాలి.ఇది కష్టం అనుకుంటే మార్కెట్లో పుల్కాలు కాల్చుకొనే గ్రిల్ దొరుకుతుంది . దానిమీద రెండు వైపులాకాల్చుకోవాలి . బట్టర్ కొద్దిగా కరిగించి , బ్రష్ తో గానీ ,స్పూన్ తో గానీ నాన్ కిరెండు వైపులా రాసి ,వేడిగా సర్వ్ చేయాలి.

Friday, May 9, 2014

మాగాయ పప్పు

మాగాయ పప్పు : కుక్కర్ లో కందిపప్పు పెట్టాలి. పప్పు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి, అందులో కాస్త మాగాయ పచ్చడి వేసి, పప్పు వేసి కలిపెయ్యాలి. ఇది మామిడికాయ పప్పు లాగా ఉంటుందండోయ్…

కారట్ హల్వా

కారట్ హల్వా అందరికీ తెలిసిందే . మంచి కారట్స్ అంటే మంచి రంగులో ,లావుగావుండాలి అప్పుడే జ్యూసీ గా వుంటాయి .అలాంటి కారట్స్ తెచ్చుకొని ,తురుముకొనిపెట్టు కోవాలి. ఒక బౌల్ కారట్ తురుముకి ,పావుకిలో చక్కర పడుతుంది . మిల్క్మెయిడ్ ,కోవా వాడితే చక్కర 100 గ్రా. సరిపోతుంది .
పాన్ వేడి చేసి 2 sp నెయ్యివేసి జీడి పప్పు ,కిస్ మిస్ వేయించాలి .
తరువాత మరి కాస్త నెయ్యి వేసి ,కారట్ తురుము వేయించాలి.కమ్మటి వాసనవచ్చేవరకు వేయించాలి. తరువాత 1 కప్పు పాలు పోసి ఉడికించాలి .కారట్ ఉడికినతరువాత ,పంచదార వేసి బాగా కలపాలి.మిల్క్ మెయిడ్/ కోవా , కూడా వేస్తే చాలారుచి. అవి లేకపోతే పంచదార తో చేసుకోవచ్చు. బాగా కలిపి కొంచం గట్ట్టిపడ్డాక ( మరీగట్టిగా చేయరాదు ) , జీడిపప్పు , కిస్మిస్ ,కొంచం వనిల్లా ఎసెన్స్ వేయాలి .అదిలేకపోతే యాలకులపొడి.కానీ వనిల్లా ఎసెన్స్ 2 చుక్కలు వేస్తే చాలా బావుంటుంది.# ఇదే పద్ధతిలో బీట్ రూట్ హల్వా కూడా చేయవచ్చు.

టమోటా బాత్

కావలసిన పదార్థాలు
ఒక గ్లాసు ఉప్మారవ్వ
పండిన టమోటాలు 3
ఉల్లిపాయ 1
అల్లం
పచ్చిమిర్చి, లేక ఒక స్పూను కారం
2 స్పూన్లు నెయ్యి
కరివేపాకు
కొత్తిమీర
MTR సాంబారు పొడి
నాలుగు బీన్సు (చిన్న ముక్కలు), లేక పచ్చి బటానీలు
జీడిపప్పు, శనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు

తయారు చేయు విధానము
బాణలిలో నూనె వేసి పోపుగింజలు వేగాక కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి వేగాక నీళ్ళు పోయాలి. నీళ్ళు బాగా మరిగాక, తగినంత ఉప్పు వేసి, MTR సాంబారు పొడి 3 స్పూనులు వేసి, తరవాత బొంబాయి రవ్వ మెల్లగా పోస్తూ కలియపెట్టాలి. మూత పెట్టి కాసేపయాక, నెయ్యి, కొత్తిమీర జల్లి కలియపెట్టాలి. ఇలా చేసి చూడండి. చాలా రుచిగా వుంటుంది.
ముఖ్య గమనిక
టమోటాబాత్ కి MTR సాంబారుపొడి, పోపులో జీలకర్ర వేస్తేనే రుచిగా వుంటుంది. నూనె పల్లీనూనె ఐతేనే రుచిగా వుంటింది. నూనె కూడా సరిపడా వెయ్యాలి. లేకపోతే ఉప్మా ఉండలు కడ్తుంది. ప్లేటులో పెట్టేటప్పుడు పులుసు గరిటతో నొక్కి వేస్తే ఇడ్లీ షేపు వస్తుంది. ఈ టమోటాబాత్ ఓట్సుతో కూడా చెయ్యచ్చు.

Sunday, May 4, 2014

వంటింటి చిట్కాలు

కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
ఫ్లాస్క్ ని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగ తో కడిగితే సరి.
బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి.
ఆమ్లెట్ కు అదనపు రుచి రావాలంటే సోనకు కొబ్బరి కోరు జోడించాలి.
సూప్ ను పొయ్యి మీద నించి దించాక రెండు చెంచాల పాల మీగడ కలిపితే చిక్కదనంతో పాటు అదనపు రుచి తోడు అవుతుంది.
తరిగిన బంగాళ దుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వినేగార్ చల్లితే చాలు.
తేనె సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవ్.
అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజా గా ఉంటుంది.
బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.
వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.
నిలవ పచల్లకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
కాలిఫ్లోవేర్, పాలకూర వంటి వాటిని శుబ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వినేగార్ కలపండి.
కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.
గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేస్తే అవి పగిలిపోకుండా ఉంటాయి.
కిలో గోధుమలలో గుప్పెడు సనగలు చేర్చి మరపట్టిస్తే చపాతీలు తెల్లగా మరియు రుచిగా ఉంటాయి.
బత్తాయి రసం తీసాక గింజలను వేరుచేసాక మిగిలిన గుజ్జులో పంచదార కలుపుకొని తింటే రుచికరంగా ఉంటుంది, చక్కటి పోషకాలు అందుతాయి.
అరటిపండు పువ్వులను fridge లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన మారిపోతుంది.
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి.
రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే సుబ్రపడుతుంది.
snack వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది.
పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
బియ్యం, తృణ ధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేఖలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్ళలో వినేగార్ కలిపి రుద్దితే పోతాయి.
వాడేసిన నిమ్మచేక్కలతో లంచ్ boxes ని రుద్దితే వాసన రాకుండా ఉంటాయి.
ఇత్తడి రాగి పాత్రలను మగ్గిన అరటిపండు గుజ్జుతో తోమితే కోత్తవాటిలా మెరుస్తాయి.
నిమ్మరసం లో ఉప్పు కలిపి వంట గది గట్టుని రుద్దితే జిడ్డు పోతుంది.
పులుసు కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి.
కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.
కోసిన ఉల్లిపాయలు సగమే వాడినప్పుడు పాడవటం పదేయ్యటం జరుగుతోందా? అయితే వాడగా మిగిలినదానికి కాస్త వెన్న రాసి చూడండి, తాజాగా ఉంటుంది.
కప్ అడుగు బాగంలో టీ మరకలు ఎండిపోతే కాస్త ఉప్పు చల్లి నీళ్ళు పోసి నానా పెడితే అవి సులువుగా వదిలిపోతాయి.
బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనె లో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.
cooker అడుగుబాగం నల్లగా మారితే అందులో గ్లాస్ నీళ్ళు పోసి కాగితం పరిస్తే మరునాడుకి తెల్లబడుతుంది.
గుడ్డులోని పచ్చ సొన వంట గది గట్టు మీద పడితే ఆ ప్రాంతంలో ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మారక ఆనవాళ్ళు ఉండవు.
దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
వేడిచేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా తాజాగా ఉంటుంది.
బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు.
పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి వేస్తే సరిపోతుంది.
పిండిలో పావు కప్పు వేయించిన సేమియా వేస్తే, గారెలు మరింత రుచిగా ఉంటాయి.
అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
ఇడ్లీ దోస పిండి మరునాటికి పులవకుండా ఉండాలంటే, గిన్నె మీద తడి వస్త్రం కప్పాలి లేదా సోడా ఉప్పు వెయ్యాలి.
మజ్జిగ పలచన అయితే పది కరివేపాకు రెబ్బలు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కపడతాయి.
వెన్న కాచేటప్పుడు నెయ్యి తాజా గా ఉండి మంచి వాసన వస్తు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే గిన్నెలో ఒక తాజా తమలపాకు వేసి కాచితే సరి.
పుదినా కొత్తిమీర చెట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
వెల్లుల్లిని fridge లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి, పోట్టుకూడా సులువుగా వస్తుంది.
కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, decoction లో చిటికెడు ఉప్పు వేసి చూడండి.
పావుగంట పాటు వేడి నీళ్ళలో నాన పెడితే బాదం పొట్టు సులువుగా వస్తుంది.
ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.
కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.
మరీ జిడ్డు పేరుకుపోయిన పాత్రలను తోమడానికి ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కలతో తోమి పాత పత్రికలతో రుద్దితే సరి.
ఒకసారి వేసిన వడ లని మళ్ళి వేయిస్తుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, దీన్ని నివారించేందుకు వడ లని ఒక నిమిషం మాత్రమె వేయించండి. ఆ వెంటనే tissue కాగితంపై ఉంచండి. అధిక నూనె సమస్య ఉండదు, వడలు కరకరలాడతాయి.
ఆకు కూరలు ఉడికించిన నీటిని వృధాగా పారెయ్యకుండా soup ల తయారీలో వాడుకోవచు.
ఫ్లాస్కులని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.
బొంబాయి రవతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువయ్యినప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.
మరీ నిల్వ ఉంచిన సెనగపిండిని పారవేయ్యకుండా స్టీలు గిన్నెలు వెండి సామాన్లను తోమితే చక్కగా సుబ్రపడతాయి.
వొంట గదిలో చీమలు బారులు తీరాయా? అయితే అవి ఉన్న చోట నిమ్మరసం చల్లండి.
పాలలో మీగడ ఎక్కువగా రావాలంటే కాచడానికి ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.
అరటి, బంగాళ దుంప ముక్కల మీద ఉప్పు నీళ్ళు చల్లి పావుగంట అయ్యాక వేపుడు చేస్తే ముక్కలు బాగా వేగుతాయి.
వెల్లుల్లి రెబ్బల్ని గంటపాటు నీళ్ళల్లో నాన పెట్టి పొట్టు తీస్తే సులువుగా వస్తాయి.
ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
గుడ్లను ఉడికించే నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగాకుండా ఉండాలంటే, మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
సగానికి కోసిన ఆపిల్ ముక్కలు నల్లగా రంగు మారకుండా ఉండాలంటే, తెల్లని బాగంలో ఉప్పు రాయాలి.
మిగిలిపోయిన బ్రెడ్ను కాసేపు ఓవెన్ లో ఉంచి పొడి చేసి పులుసులో వేసుకుంటే రుచిగా ఉంటుంది.

పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
పచ్చి కొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం పూస్తూ ఉంటె వారం వరకు తాజాగా ఉంటాయి.
ఇంగువ గడ్డ కడితే, ఆ డబ్బాలో నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే పొడిగా అవుతుంది.
టమాటాలు వండటానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి.
కోడిగుడ్డు పెంకులను కిటికీలు ventilators వద్ద పెడితే, క్రిమి కీటకాలు చేరవు.
cauliflower తో వంటలు చేసేటప్పుడు అందులో కాసిని పాలు కలిపితే, వంట మరింత రుచిగా ఉంటుంది.
కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.

పుదినా కొత్తిమీర చట్ని రంగు మారకుండా ఉండాలంటే చేసిన వెంటనే నిమ్మరసం పిండితే సరిపోతుంది.
పెసర పిండిలో నిమ్మరసం కలిపి వెండి సామాగ్రిని రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
పచ్చిమిర్చిని కొసాక పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని కడిగితే మంటగా ఉండదు.
ఆకు కూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే కూర సహజ రంగుని కోల్పోదు.
బంగాల దుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి.
గుడ్డులోని సొనకు పాలు కాస్త పంచదార కాస్త కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
కందముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, అవి త్వరగా ఉడుకుతాయి.
ఇంట్లో చేసుకునే తమటా సూప్కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే, రంగు పోషకాలు రెండు అందుతాయి.
వంటకాలు తక్కువగా పీల్చుకోవాలంటే అందులో అరచెంచా వెనిగర్ని కలిపి చూడండి.
కాచిన నెయ్యిలో నాలుగు మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది.
పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయిన్చేతప్పుడు పేలకుండా ఉంటాయి.

బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా సెనగపప్పు వేస్తే మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలను వేస్తే, మంచి వాసన వస్తుంది.

పాలకూర పకోడీలు

పాలకూర పకోడీలు కరకర లాడుతూ మంచి రుచిగావుంటాయి. ఇవి శనగపిండి తో చేసే ఉల్లిపాయ పకోడీల్లా, ఎక్కువ నూనె పీల్చవు. పైగా ఎక్కువ ఆకుకూర..అందునా పాలకూర..పిల్లలకి మంచి స్నాక్ అవుతుంది. స్కూల్ నుండి రాగానే ,ఇంట్లో చేసిన పదార్ధాలనే ఇస్తే,ఆరోగ్యం కూడా.ఇందుకు కావలసిన పదార్ధాలు ..
కావలసిన పదార్ధాలు :
1.శుభ్రంచేసి,కడిగి,తరిగిన పాలకూర 5 కట్టలు,
2. శనగపిండి 2 కప్పులు ,
3. బియ్యప్పిండి పావు కప్పు,
4. అల్లవేల్లుల్లి పేస్ట్ 1 sp.,
5.ఉప్పు+కారం తగినంత,
6. కొత్తిమిర తరుగు 1 కట్ట,
7.పచ్చిమిర్చి 3 సన్నగాతరిగి,
8. జీలకర్ర పొడి 1 sp,
9 . వేయించడానికి నూనె తగినంత .
చేయువిధానము : ఒక వెడల్పైన పాత్రలో శనగపిండి + పాలకూర తరుగు + బియ్యప్పిండి + అల్లం వెల్లుల్లి పేస్ట్ + జీరా పొడి+ఉప్పు+కారం +కొత్తిమీర + పచ్చిమిర్చి తరుగు వేసి అందులో కాచిననూనే ఒక పెద్ద చెంచాడుపోసి బాగా కలిపి,కొద్దిగా నీరుచల్లి (జాగ్రత్త గా కలపాలి ,ఎక్కువ నీరు పట్టదు .)గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రై పాన్ పెట్టి ,నూనె పోసి వేడి చేయాలి.నూనె వేడెక్కాక.. చేతిలోకి పెద్ద పిండి ముద్ద తీసుకొని ,పకోడీల్లా నూనెలో వేయాలి..మీడియం ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ..పైన ఇష్టమైతే కొంచం ఛాట్ మసాలా చల్లుకొంటే ..వేడి వేడి పాలక్ పకోడీలు సిద్ధం.ప్రయత్నిస్తారు  కదూ..  :)

Friday, May 2, 2014

టమాట పెరుగు పచ్చడి


ఇది కూడా సులువుగా అయే ఐటం
కావలసినవి -
టమాటాలు-2,
పెరుగు -1 కప్పు,
పచ్చిమిర్చి-2,
పోపుకి- ఎండు మిర్చి-1,శెనగ పప్పు,ఆవాలు,జీలకర్ర,వాము,
పచ్చిమిర్చి,అల్లం,కర్వెపాకు,కొత్తిమీర .
______________
తయారీ విధానం-
ముందు టమాటా కడిగి ముక్కలు చేసి, కొద్దిగా నీరు పోసికాస్త ఉప్పు వేసి స్టవ్ పై ఉడికించి,చల్లార్చి,ఉంచుకోవాలి.

పెరుగు చిలికి-కాస్త ఉప్పేసి ఉంచుకుని,అందులో పోపు వెయ్యాలి.
పోపు -మూకుట్లో నూనె వేసి,వేడయ్యాక- ఆవాలు,శెనగ పప్పు,జీలకర్ర,వాము, వేసి,వేగాక
పచ్చిమిర్చి,అల్లం,వేసి స్టవ్ ఆపేసి, కర్వెపాకు కూడా వేసి,పెరుగు లో కలపాలి.
ఇప్పుడు చల్ల్లారిన టమాటా గుజ్జగా చేసి, కలిపెయ్యాలి.
కొత్తిమీర చల్లుకోవాలి.
పెసరకట్టు : అన్నం కుక్కర్ లోనే కాస్తంత పెసరపప్పు నీళ్ళు పోసి పెట్టాలి. కుక్కర్ మూత రాగానే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు పోపు వేసి, ఉప్పు కలిపేస్తే సరిపోతుంది. మంచి చలవ చేసే పెసరకట్టుకు సరైన కాంబినేషన్ 'మెంతికాయ, మాగాయ, లేక ఆవకాయ...'.
మాగాయ పప్పు : కుక్కర్ లో కందిపప్పు పెట్టాలి. పప్పు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి, అందులో కాస్త మాగాయ పచ్చడి వేసి, పప్పు వేసి కలిపెయ్యాలి. ఇది మామిడికాయ పప్పు లాగా ఉంటుందండోయ్...
కారెట్ కూర : కారెట్ సాధారణంగా ఉడకడానికి సమయం తీసుకుంటుంది. అయితే, కారెట్ తురిమి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కర్వేపాకు వేసిన పోపులో వేసి, చివరగా ఉప్పు కలిపి, తీసేస్తే ఆ రుచి అద్భుతః. ఈ కూరకు ఐదు నిముషాల కంటే ఎక్కువ సేపు పట్టదోచ్... ప్రయత్నించండి...

వెజిటబుల్ కిచిడి

 

అన్ని వయసులవారికీ ఆరోగ్యకరంగా ,రుచిగా వుంది త్వరగా జీర్ణమయ్యే ఆహారంకిచిడీ..ఇది పసివారి నుండీ వృద్ధుల వరకూ చక్కని పోషకాహారం..త్వరగాచేసుకోగలం. దీనికి కావలసిన పదార్ధాలు..
కావలసిన పదార్ధాలు : 1. బియ్యం 1 గ్లాసు, కంది/పెసర పప్పు 1/2 గ్లాసు, సోయానగ్గెట్స్ / చిప్స్ 1/4 కప్పు , ఆలూ + బీన్స్+ పచ్చి బఠానీలు + కాలీఫ్లవర్ + కారట్+పచ్చిమిర్చి (3),+ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి 3 కప్పులు., పసుపుఉప్పు,నూనె, పోపు దినుసులు, మిరియాలు, నెయ్యి .,కరివేపాకు ,కొత్తిమిర.
తయారు చేయు విధానము : ముందుగా బియ్యము + పప్పు కడిగి కాసిని
నీళ్ళుపోసి పెట్టుకోవాలి. కుక్కర్ వేడి చేసి కొద్దిగా నూనె + నెయ్యి వేసి
పోపుదినుసులు + జీలకర్ర + మిరియాలు,కరివేపాకు వేసుకోవాలి తరవాత
కూరగాయ ముక్కలూ ,సోయా నగ్గెట్స్ వేసుకొని పసుపు వేయాలి..కాసేపు కలిపికడిగి ఉంచుకున్న బియ్యం పప్పు వేసుకోవాలి. అన్నీ మరోసారి కలిపి ,తగినంతఉప్పు వేసుకొని , 2 గ్లాసుల నీల్లుపోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్రానివ్వాలి.. వెయిట్ వచ్చాక మూతతీసి మరి కాస్త నెయ్యి, కొత్తిమిర చల్లుకొంటేఘుమ ఘుమ లాడే కిచిడీ సిద్ధం..