Monday, February 24, 2014

వంకాయ్ బజ్జి

పచ్చడికి కావలసినవి :- 1.పెద్దవంకాయలు 1 or 2 ;2.ఎండుమిర్చి 7;3.శనగపప్పు,మినప్పప్పు 2 sp చొప్పున ; 4.చింతపండు ; 5. ఆయిల్ 3 sp ; 6. కొత్తిమిర ,కరివేపాకు ;7.ఉప్పు తగినంత ;8.వెల్లుల్లి రేకలు 5. చేయువిధానం :- వంకాయలు బాగాకడిగి తుడిచి ,కొద్దిగా ఆయిల్ రాసి స్టవ్ పైన వుంచి ,మంతతగ్గించి బాగా కాల్చాలి .దగ్గ్గరేవుండి ఎక్కువ బర్న్ కాకుండా చూసుకోవాలి.పూర్తిగా కాలిన తరవాత,చల్లార్చి ,పైపొట్టు వలిచేయాలి .కాయలో పుచ్చు,పురుగులున్నాయేమో చెక్ చేసుకోవాలి .సాధారణంగా పుచ్చు వుంటే కాయమీదే తెలుస్తుంది..అలాంటివి కొనకూడదు..పురుగు వస్తే పడేయడమే..ఇప్పుడు వంకాయ గుజ్జు పక్కన పెట్టుకొని..
పాన్ వేడి చేసి ఆయిల్ వెయ్యాలి. ఆయిల్ వేడిఅయ్యాక ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకొని ,శనగపప్పు ,మినపప్పు వేయించాలి.అవిఎర్రగా వేగాక తీసి మిగిలిన నూనెలో కరివేపాకు,కొంచం ఇంగువ ,పావు sp.ఆవాలు వేసి స్టవ్ కట్టేయాలి..
మిక్సీ జార్లో ఎండు మిర్చి,వేయించినపప్పులు,ఉప్పు, కొత్తిమిర వెల్లుల్లి ,చింతపండు వేసి తిప్పాలి..కొద్దిగా బరకగా అయ్యాక తీసి గిన్నెలో వేసి అందులో వంకాయ గుజ్జు వేసి మెత్తగా చేత్తో గుజ్జు చెయ్యాలి.పైన సిద్ధంగా వున్న పోపు కలిపితే వంకాయ బజ్జీ రెడీ..కమ్మగా ఉండాలంటే కారము చింతపండు తక్కువగా వెయ్యాలి సుమా ..మరి ట్రై చెయ్యండి ..

0 comments:

Post a Comment