Wednesday, February 26, 2014

స్టఫ్డ్ భేండీ

కావలసిన పదార్థాలు :
బెండకాయలు - అర కిలో
జీలకర్ర - 1 టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
జీలకర్ర పొడి - ఒక స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ - ఒక టీ స్పూన్
పచ్చిమిరపకాయలు - 2
కారం - ఒక టీ స్పూన్
పల్లీలు - అర కప్పు
పసుపు - అర టీ స్పూన్
కరివేపాకు - 4 రెమ్మలు
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
పల్లీలను పొడి చేసుకోవాలి. దీంట్లో జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఆమ్‌చూర్ పౌడర్, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బెండకాయలను కడిగి పెద్ద, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతేకాదు.. ఆ ముక్కలకు ఒక వైపు గాటు పెట్టాలి. దీంట్లో పల్లీలతో చేసిన పొడిని కూరుకోవాలి. ఇలా అన్ని ముక్కల్లో ఆ పొడిని కూరాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలను వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఆపై స్టఫ్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత ఉప్పు వేసి సన్నని మంట మీద మరికాసేపు ఉంచాలి. ముక్కలు మెత్తగా అయితే కూర దించేయొచ్చు. స్టఫ్డ్ భేండీ సర్వ్ చేయడానికి తయారయినట్లే!

మునగాకు పప్పు

కావలసినవి
పెసరపప్పు - 300 గ్రా.,
మునగాకు - 200 గ్రా.
టొమాటో తరుగు - పావు కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు
పసుపు - కొద్దిగా
శనగపప్పు - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
ధనియాలపొడి - టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
ఎండుమిర్చి - 2
ఆవాలు - టేబుల్ స్పూన్
జీలకర్ర - టేబుల్‌స్పూన్
రిఫైన్‌డ్ ఆయిల్ - 50 మి.లీ.
వెల్లుల్లి రేకలు - 10
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారి

  • ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి, పసుపు జత చేసి, తగినంత నీరు పోసి మెత్తగా ఉడికించాలి.
  • మునగ ఆకులను శుభ్రం చేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
  • బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర కరివేపాకు వేసి వేయించాలి.
  • వెల్లుల్లి రేకలు, ఉల్లితరుగు, టొమాటో తరుగు, మునగ ఆకులు వేసి కొద్దిగా ఉడికించాలి.
  • ఉడికించిన పెసరపప్పు జతచేసి, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి రెండు నిముషాలు ఉంచాలి.
  • కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేయాలి.

బీరకాయ పల్లీ మసాలా

కావలసినవి:
బీరకాయ (పెద్దది) - ఒకటి,
ఉల్లిపాయ (పెద్దది, తరిగి) - ఒకటి,
వేగించిన పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు,
ఎండుమిర్చి - ఐదు,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - ఒక టేబుల్ స్పూన్.
తాలింపుకు:
నువ్వుల నూనె - ఒక టేబుల్ స్పూన్,
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ - ఒక్కో టీస్పూన్.
తయారీ:
బీరకాయ చెక్కు తీసేసి సన్నగా తరగాలి. వేగించిన పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు వేయాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరువాత తరిగిన బీరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. (నీళ్లు పోయొద్దు. ఉడికేటప్పుడు బీరకాయ ముక్కల నుంచి నీరు వస్తుంది.) చివరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి కలిపి కొన్ని నిమిషాల తరువాత స్టవ్ పైనుంచి గిన్నె దింపేయాలి. ఈ కూరని వేడివేడిగా అన్నం, రోటీ, పరాఠాల్లో తింటే బాగుంటుంది.

భేండీ మసాలా

కావలసిన పదార్థాలు :
బెండకాయలు - కిలో
ఉల్లిగడ్డలు - 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -
ఒక స్పూన్
ధనియాల పొడి -
ఒక స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ - ఒక టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
బెండకాయలను మంచిగా కడిగి పెద్ద, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనెపోసి జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపేస్టూ కలపాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేగనిచ్చి బెండకాయ ముక్కలను వేయాలి. సన్నని మంట మీద ఒక పావు గంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో ముందుగా పసుపు, కారం వేసి కాసేపు కలపాలి. ఆ పై గరం మసాలా పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోవాలి. వేడి.. వేడి.. భేండీ మసాలా మీ ముందుంటుంది. ఈ కూర చపాతీల్లోకి చాలా బాగుంటుంది.

పల్లీ ఫ్రైడ్ రైస్

కావలసినవి
అన్నం- 2 కప్పులు
ఉప్పు- తగినంత

పొడి:
పల్లీలు- 4 టేబుల్  స్పూన్లు
ఎండుమిర్చి - 3
నువ్వులు- 2  టి.స్పూన్
కొబ్బరిముక్కలు - 2  టేబుల్ స్పూన్లు
పోపు:
నూనె - 2 టి.స్పూన్
ఆవాలు, జీలకర్ర- 1/4  టి.స్పూన్
మినప్పప్పు- 1  టి.స్పూన్
శనగ పప్పు- 2  టి.స్పూన్
కరివేపాకు- 1 రెబ్బ
కొత్తిమీర - కొద్దిగా

ఇలా చేయాలి
అన్నం పొడిపొడిగా  ఉండేలా వండుకోవాలి.


  • మిగిలిపోయిన  అన్నంతోకూడా దీన్ని  చేసుకోవచ్చు.
  • బాణలి  వేడిచేసి పల్లీలు,  నువ్వులు,  ఎండుమిర్చి, కొబ్బరి  ముక్కలు దోరగా  వేయించుకుని చల్లారిన  తర్వాత బరకగా పొడి  చేసుకోవాలి.
  • వెడల్పాటి  పాన్‌లో నూనె వేడి చేసి  ఆవాలు, జీలకర్ర,  కరివేపాకు వేసి  చిటపటలాడాక అన్నం  వేసి కలపాలి.
  • ఇందులో  పల్లీ మసాలా పొడి,  తగినంత ఉప్పువేసి  కలుపుతూ వేపాలి.  బాగావేగిన తర్వాత  కొత్తిమీర వేసి దింపేసి  వేడిగా సర్వ్ చేయాలి.

Monday, February 24, 2014

డేట్స్ కేక్

మైదాపిండి - 2 కప్పులు,
ఖర్జూరాలు సన్నగా తరిగిన ముక్కలు - కప్పు,
పంచదార - ముప్పావు కప్పు,
ఉప్పు లేని బటర్ - అర కప్పు,
నీరు - 2 కప్పులు,
కిస్‌మిస్ - పావు కప్పు,
జీడిపప్పు పలుకులు - పావుకప్పు,
వెనిలా ఎసెన్స్ - టీ స్పూను,
బేకింగ్ సోడా - ఒకటి ముప్పావు టీ స్పూన్లు,
నిమ్మరసం - టేబుల్ స్పూను,
పాలు - కప్పు,
ఉప్పు - చిటికెడు

ట్స్ కేక్ కావలసినవి:

మైదాపిండి - 2 కప్పులు,
ఖర్జూరాలు సన్నగా తరిగిన ముక్కలు - కప్పు,
పంచదార - ముప్పావు కప్పు,
ఉప్పు లేని బటర్ - అర కప్పు,
నీరు - 2 కప్పులు,
కిస్‌మిస్ - పావు కప్పు,
జీడిపప్పు పలుకులు - పావుకప్పు,
వెనిలా ఎసెన్స్ - టీ స్పూను,
బేకింగ్ సోడా - ఒకటి ముప్పావు టీ స్పూన్లు,
నిమ్మరసం - టేబుల్ స్పూను,
పాలు - కప్పు,
ఉప్పు - చిటికెడు
డేట్స్ కేక్ తయారి:
ఒక నాన్‌స్టిక్ పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్‌మిస్‌లు, నీరు, జీడిపప్పు పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి, దించి, చల్లారనివ్వాలి వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి జత చేయాలి పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి ఆలస్యం చేయకుండా కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేయాలి. తయారి:
ఒక నాన్‌స్టిక్ పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్‌మిస్‌లు, నీరు, జీడిపప్పు పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి, దించి, చల్లారనివ్వాలి వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి జత చేయాలి పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి ఆలస్యం చేయకుండా కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేయాలి.

అల్లం పచ్చడి

కావలిసినవి : 1.అల్లం పెద్దముక్క (పొట్టు తీసి ,కడిగి,ముక్కలుచేసుకోవాలి )
2. ఎండు మిర్చి .10 ; 3.బెల్లం పెద్దముక్క (గడ్డగా వుంటే పొడిచేసుకోవాలి )
4.నువ్వులు 1 sp., 5. పచ్చిసనగపప్పు,మినప్పప్పు 1 sp.చొ.న ..,6.ఆయిల్ 4 టేబుల్ sp.,7.ఆవాలు+ కరివేపాకు
పాన్ లో ఆయిల్ వేడిచేసి ఎండుమిర్చి వేయించాలి తరవాత శనగపప్పు+మినప్పప్పు వేయించాలి .స్టౌ ఆర్పి , అదే పాన్లో కరివేపాకు + నువ్వులు వేసి చల్లారనివ్వాలి..ఆవేడికి ఆరెండూ వేగుతాయి .చింతపండు బాగా కడిగి కొద్దిగానీళ్లు పోసి ఉడికించాలి. అందులోనే బెల్లం పొడివేస్తే కరిగిపోతుంది.ఇప్పుడు మిక్సీ జార్లో ముందు ఎండుమిర్చి +ఉప్పు + వేయించుకొన్న పప్పులు వేసి తిప్పాలి .అవి పోడి అయ్యాక అందులో అల్లం ముక్కలూ + చింతపండు మిశ్రమం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జార్లో వున్నప్ప్పుడే ఉప్పు,బెల్లం సరి చూసుకోవాలి.కొంచం అల్లం ఘాటు తెలిస్తేనే బావుంటుంది. కొందరికి తీపి ఇష్టం. అలాంటప్పుడు బెల్లం కొంచం ఎక్కువ వేసుకోవచ్చు . అన్నీ సరిపోయాయనుకొంటే డిష్ లోకి తీసి, ఐ sp ఆయిల్ లో ఆవాలు,కరివేపాకు ,ఇంగువ వేసి ..చిటపట లాడాక..పచ్చడిపైన వేసి కలపండి..ఘుమ ఘుమల అల్లం చట్నీ రెడీ..

పుదినా పచ్చడి


పుదినా పచ్చడి :- కావలసినవి 1.పుదినా 4 కట్టలు,2. ఎండు మిర్చి 6,7; 3.పచ్చిశనగ పప్పు ,మినప్పప్పు చేరోస్పూన్ ;4.బెల్లం చిన్నముక్క ; 5.నువ్వులు ఒకస్పూన్ ; 6.చింతపండు కొద్దిగా , 7.ఆవాలు పావు స్పూన్ ; కరివేపాకు ,చిటికెడు ఇంగువ , 8. నూనె 2 టేబుల్ స్పూ.
చేసే విధానం : పాన్ వేడి చేసి నువ్వులు కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.తరవాత ఆయిల్ వేసి ఎండుమిర్చి ,శనగ పప్పు ,మినప్పప్పు వేయించి పక్కనపెట్టుకొని ,మిగిలిన నూనెలో ఇంగువ వేసి శుభ్రం చేసి కడిగిన పుదినా వెయ్యాలి.మూతపెట్టి మగ్గించాలి..చింతపండు వేగినపుదినా పైనే వేస్తే మెత్తగా అవుతుంది. అన్నీ చాల్లారాక మిక్సీలో వేసి ఉప్పు,కూడా వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి..1 sp ఆయిల్ లో ఆవాలు+ ఇంగువ (వెల్లుల్లి )+ కరివేపాకు వేసి పచ్చడిలో వెయ్యాలి. ఉప్పు సరిచూసుకుంటే..పుదినా పచ్చడి రెడీ

వంకాయ్ బజ్జి

పచ్చడికి కావలసినవి :- 1.పెద్దవంకాయలు 1 or 2 ;2.ఎండుమిర్చి 7;3.శనగపప్పు,మినప్పప్పు 2 sp చొప్పున ; 4.చింతపండు ; 5. ఆయిల్ 3 sp ; 6. కొత్తిమిర ,కరివేపాకు ;7.ఉప్పు తగినంత ;8.వెల్లుల్లి రేకలు 5. చేయువిధానం :- వంకాయలు బాగాకడిగి తుడిచి ,కొద్దిగా ఆయిల్ రాసి స్టవ్ పైన వుంచి ,మంతతగ్గించి బాగా కాల్చాలి .దగ్గ్గరేవుండి ఎక్కువ బర్న్ కాకుండా చూసుకోవాలి.పూర్తిగా కాలిన తరవాత,చల్లార్చి ,పైపొట్టు వలిచేయాలి .కాయలో పుచ్చు,పురుగులున్నాయేమో చెక్ చేసుకోవాలి .సాధారణంగా పుచ్చు వుంటే కాయమీదే తెలుస్తుంది..అలాంటివి కొనకూడదు..పురుగు వస్తే పడేయడమే..ఇప్పుడు వంకాయ గుజ్జు పక్కన పెట్టుకొని..
పాన్ వేడి చేసి ఆయిల్ వెయ్యాలి. ఆయిల్ వేడిఅయ్యాక ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకొని ,శనగపప్పు ,మినపప్పు వేయించాలి.అవిఎర్రగా వేగాక తీసి మిగిలిన నూనెలో కరివేపాకు,కొంచం ఇంగువ ,పావు sp.ఆవాలు వేసి స్టవ్ కట్టేయాలి..
మిక్సీ జార్లో ఎండు మిర్చి,వేయించినపప్పులు,ఉప్పు, కొత్తిమిర వెల్లుల్లి ,చింతపండు వేసి తిప్పాలి..కొద్దిగా బరకగా అయ్యాక తీసి గిన్నెలో వేసి అందులో వంకాయ గుజ్జు వేసి మెత్తగా చేత్తో గుజ్జు చెయ్యాలి.పైన సిద్ధంగా వున్న పోపు కలిపితే వంకాయ బజ్జీ రెడీ..కమ్మగా ఉండాలంటే కారము చింతపండు తక్కువగా వెయ్యాలి సుమా ..మరి ట్రై చెయ్యండి ..

Sunday, February 23, 2014

సగ్గుబియ్యం దోసెలు

సగ్గుబియ్యం దోసెలు : కావాల్సిన వస్తువులు: రెండు కప్పులు సగ్గు బియ్యం, ఒక కప్పు బియ్యం, ఒకకప్పు పెరుగు., నాలుగు పచ్చిమిర్చి, కొంచెం అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె.
సగ్గుబియ్యం, బియ్యం, కడిగి పెరుగు వేసి రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. తరిగిన కొత్తిమీర వేసి కలిపి పెనం మీద దోసెలు వేసి, వేడిగా తినాలి. పల్చగా కరకరలాడే దోసెలతో ఏ పచ్చడీ లేకపోయినా బావుంటాయి.