ఇది చెయ్యడానికి కావలసిన పదార్ధాలు చూద్దాం.
కావలసిన పదార్ధాలు : చామదుంపలు ¼ కిలో , చింతపండు 20 గ్రా.,నూనె 2 sp.,
బియ్యప్పిండి 1 sp ., బెల్లం చిన్నముక్క,ఇంగువ పావుచెంచా ,జీలకర్ర మెంతుల
పొడి 1 sp ,అల్లం వెల్లుల్లి పేస్ట్ ,గరంమసాలా1 sp,ఉల్లితరుగు
1 కప్పు ,కర్వేపాకు,కొత్తిమీర,పోపుదినుసులు, కారం ,ఉప్పు తగినంత.
చేయువిధానము : చామదుంప లు బాగా కడిగి ,కుక్కర్లో మూడు విజిల్స్
రానివ్వాలి. చల్లారాక పొట్టువలిచి వుంచుకోవాలి.పాన్ వేడి చేసి 2 sp నూనె
వెయ్యాలి. నూనె వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించాలి. మసాలా ఇష్టమైన
వారు అల్లం వెల్లుల్లి ముద్ద ,ఇష్టం లేని వారు ఇంగువ వేసుకోవాలి.కరివేపాకు
కూడా వేసి ,తరువాత చామదుంపలు +పసుపు వేసి వేయించాలి. 3 ని బాగా కలిపి
,చింతపండు రసం చిక్కగా తీసి ముక్కలపైన పోయాలి.పులుసు ఉడుకు పట్టగానే,
బియ్యప్పిండి లో నీళ్ళు కలిపి ,అందులోనే జీలకర్ర మెంతులపొడి , బెల్లం
తురుము, ఉప్పు, కారం కూడావేసి ,పులుసుకు కలపాలి. మసాలా ఇష్టమైన వారు ఒక
sp.గరం మసాలా పొడి వేసుకోవాలి.పులుసు చిక్కగా ,ఘుమ ఘుమ లాడుతూ తయారు
అవుతుంది. కొత్తిమీర చల్లుకుంటే చామదుంప అంటు పులుసు రెడీ..అన్నం లోకి
,రోటీల్లోకి కూడా బావుంటుంది.
Thursday, July 3, 2014
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment