[మామిడి,అరటి,యాపిల్,కమలా,ద్రా
చేయువిధానం : పాలు బాగా మరగ నివ్వాలి. మరుగుతున్నప్పుడే అందులో చక్కెరవేసి బాగా కలుపుతూ వుండాలి. ఒక కప్పులో అరగ్లాసు చల్లని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి.వేడి పాలల్లో వేస్తే ఉండలు కట్టి ,గట్టిపడతాయి. పొరపాటున కూడా అలా చేయరాదు. కస్టర్డ్ కలిపిన చల్లటి పాలను జాగ్రత్తగా పోస్తూ, బాగా కలుపుతూ వుండాలి. లేకపోతే అడుగున ఉండలు కట్టి మాడిపోయి , కాటు వాసన వస్తుంది. పదార్ధం పూర్తిగా పాడయిపోతుంది . బాగా కలుపుతూవుంటే పాలు చిక్కగా అవుతాయి. స్టవ్ కట్టేసి , కలుపుతో,(మీగడ కట్టకుండా ) చల్లారనివ్వాలి. చల్లారాక ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
పండ్లని బాగా కడిగి ,శుభ్రం చేసి ,పొట్టు తీసి చిన్నముక్కలు చేసుకోవాలి. అరటి పండ్లు మాత్రం తినడానికి ముందు మాత్రమే కలపాలి.నల్లబడతాయి . పండ్ల ముక్కలమీద అరచెంచా నిమ్మరసం కలిపి ఫ్రిజ్ లో ఉంచితే చల్లగా వుంటాయి . 2,3 గంటలతరువాత కస్టర్డ్ లో పళ్ళముక్కలు ,డ్రై ఫ్రూట్ ముక్కలూ కలిపి , అందమైన గాజు బౌల్ లో పిల్లలకి అందించండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ,ఎండలు బాగా వున్నాయి కాబట్టి ,స్కూల్ నుండి రాగానే చల్లగా మాంగో ఫ్రూట్ కస్టర్డ్ ఇస్తారుకదూ..
0 comments:
Post a Comment