చిన్నగ్లాసు కందిపప్పు, కాకరకాయ 1, ఒక స్పూను MTR సాంబారు పొడి, ఇంగువ, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, చింతపండు, ఉప్పు.
తయారు చేసే విధానం:
చింతపండు నీళ్ళలో
నానబెట్టుకోవాలి. కాకరకాయ చక్రాల్లా తరుగుకోవాలి. స్టౌ వెలిగించి
కుక్కరులో పప్పు ఉడికించుకోవాలి. మూకుడులో నూనె వేసి కాకరకాయముక్కలు బాగా
ఎర్రగా వేయించాలి. వేగాక చింతపండు పులుసు పోసి, ఉప్పు, పసుపు వేసి, అందులో
ఉడికిన పప్పు వేసి ఉడికించాలి. ఆఖర్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి,
కరివేపాకు, ఇంగువ, రెండు పచ్చిమిర్చి పోపులో వేయించి, కొంచెం ఎర్రకారం వేసి
పులుసులో కలపాలి. కావాలంటే కొత్తిమీర కూడా వెయ్యచ్చు.
0 comments:
Post a Comment