Thursday, October 24, 2013

వెజిటబుల్ చాక్లెట్ స్నాక్స్(ఉల్లి వెల్లుల్లి లేని వంటలు):-

వెజిటబుల్ చాక్లెట్ స్నాక్స్(ఉల్లి వెల్లుల్లి లేని వంటలు):-

స్నాక్స్ ఎన్నిరకాలుగా చేసినా వైవిధ్యంగా ఉంటాయి. మామూలుగా ఉపయోగించే వస్తువులనే కాస్త వెరయిటీగా చేసుకోవచ్చు. కంటికింపుగా, తినడానికి రుచిగానూ, పిల్లలకైతే కొత్తగా ఉంటాయి..
మైదా – 2 కప్పు
నెయ్యి లేదా డాల్డా – 3 tbsp
క్యాబేజీ తురుము – 1/4 కప్పు
క్యారట్ తురుము – 1/4 కప్పు
క్యాప్సికమ్ తురుము - 1/4 కప్పు
ఉప్పు – తగినంత
అజినొమొటొ – చిటికెడు
కారం పొడి – 1/2 tsp
గరం మసాలా పొడి – 1/4 tsp
పోపు దినుసులు – 1/4 tsp
నూనె – 3 tsp
మైదాలో చిటికెడు ఉప్పు, కరిగించిన నెయ్యి లేదా డాల్డా వేసి తగినన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా తడిపి మూతపెట్టి ఉంచాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి కూరగాయల తురుము వేసి మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత అందులో అజినొమొటొ, కారం పొడి, తగినంత ఉప్పు, గరం మసాలా పొడి పూర్తిగా తడిపోయేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తడిపిన పిండిని తీసి బాగా మృదువుగా అయ్యేలా మర్ధనా చేసుకుని ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండతో పలుచగా చపాతీలా వత్తుకుని దీర్ఘచతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఒక ముక్క తీసుకుని మధ్యలో కొంచం కూర పెట్టి చాపలా చుట్టి చాక్లెట్ లా రెండువైపులా వత్తి పెట్టుకోవాలి. అన్నీ అలా చేసుకున్నాక వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని సాస్‌తో సర్వ్ చేయాలి. ఈ కూరలో పనీర్ తురుము. మీల్‌మేకర్ కూడా కలుపుకోవచ్చు.

0 comments:

Post a Comment