Thursday, October 24, 2013

బెండకాయతో కుర్ కురే

బెండకాయతో కుర్ కురే 
బెండకాయలో ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ శక్తులు ఉన్నాయి. మెదడు వృద్ధికి బాగా పనిచేస్తోంది. ప్రతి రోజూ పిల్లలు బెండకాయను తింటే గణితంలో రాణించవచ్చు. అలాంటి బెండకాయతో పిల్లలకు నచ్చే విధంగా కుర్ కురే ఎలా చేయాలో మీకు తెలుసా..?
కావలసిన పదార్థాలు
బెండకాయలు - అరకేజీ
ఉప్పు, నూనె - తగినంత
మిరిప్పొడి - ఒక టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి - చెరో రెండు టేబుల్ స్పూన్లు
పసుపు పొడి - కాసింత
గరం మసాలా - పావు టీ స్పూన్
ఓమమ్ - పావు టీ స్పూన్
వడపప్పు పిండి - ఒక కప్పు
తయారీ విధానం :
ముందుగా బెండకాయను కడిగి తుడుచుకోవాలి. చివర్లను కట్ చేసి పొడవుగా మధ్యలో తరిగి పక్కనబెట్టుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకు వడపప్పు పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్‌, మిరప్పొడి, ఉప్పు నూనె మినహా అన్ని పట్టించి 10 నిమిషాల పాటు ఊరనివ్వాలి.
తర్వాత బాణలిలో నూనె పోసి కాగాక బెండకాయల్ని దోరగానూ, క్రిస్పీగా ఉండేట్లు వేయించి తీసుకోవాలి. ఈ బెండ కుర్ కురేలను వేడి వేడి అన్నం మీద సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్‌గా ఉంటాయి.

0 comments:

Post a Comment