Thursday, October 24, 2013

క్యారట్ సూప్

క్యారట్ సూప్ కావలసిన పదార్థాలు:
‌క్యారట్ - పావు కేజీ
ఉల్లిపాయ - రెండు.
‌పెసరపప్పు - ‌ఒక టేబుల్ స్పూన్‌.
‌వెన్న తీసిన పాలు - ఒక కప్పు.
ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.
తయారీ విధానం:
ముందుగా క్యారట్, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్లో పెసరపప్పు, మూడు టీ స్పూన్ల నీటిని వేసి ఫ్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఒంపుకోవాలి. ఇందులో వేడిపాలను వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక నిమిషం సేపు ఉడికించి దించేయాలి. దీనిని వేడివేడిగా సర్వ్ చేయాలి.

బెండకాయతో కుర్ కురే

బెండకాయతో కుర్ కురే 
బెండకాయలో ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ శక్తులు ఉన్నాయి. మెదడు వృద్ధికి బాగా పనిచేస్తోంది. ప్రతి రోజూ పిల్లలు బెండకాయను తింటే గణితంలో రాణించవచ్చు. అలాంటి బెండకాయతో పిల్లలకు నచ్చే విధంగా కుర్ కురే ఎలా చేయాలో మీకు తెలుసా..?
కావలసిన పదార్థాలు
బెండకాయలు - అరకేజీ
ఉప్పు, నూనె - తగినంత
మిరిప్పొడి - ఒక టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి - చెరో రెండు టేబుల్ స్పూన్లు
పసుపు పొడి - కాసింత
గరం మసాలా - పావు టీ స్పూన్
ఓమమ్ - పావు టీ స్పూన్
వడపప్పు పిండి - ఒక కప్పు
తయారీ విధానం :
ముందుగా బెండకాయను కడిగి తుడుచుకోవాలి. చివర్లను కట్ చేసి పొడవుగా మధ్యలో తరిగి పక్కనబెట్టుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకు వడపప్పు పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్‌, మిరప్పొడి, ఉప్పు నూనె మినహా అన్ని పట్టించి 10 నిమిషాల పాటు ఊరనివ్వాలి.
తర్వాత బాణలిలో నూనె పోసి కాగాక బెండకాయల్ని దోరగానూ, క్రిస్పీగా ఉండేట్లు వేయించి తీసుకోవాలి. ఈ బెండ కుర్ కురేలను వేడి వేడి అన్నం మీద సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్‌గా ఉంటాయి.

వెజిటబుల్ చాక్లెట్ స్నాక్స్(ఉల్లి వెల్లుల్లి లేని వంటలు):-

వెజిటబుల్ చాక్లెట్ స్నాక్స్(ఉల్లి వెల్లుల్లి లేని వంటలు):-

స్నాక్స్ ఎన్నిరకాలుగా చేసినా వైవిధ్యంగా ఉంటాయి. మామూలుగా ఉపయోగించే వస్తువులనే కాస్త వెరయిటీగా చేసుకోవచ్చు. కంటికింపుగా, తినడానికి రుచిగానూ, పిల్లలకైతే కొత్తగా ఉంటాయి..
మైదా – 2 కప్పు
నెయ్యి లేదా డాల్డా – 3 tbsp
క్యాబేజీ తురుము – 1/4 కప్పు
క్యారట్ తురుము – 1/4 కప్పు
క్యాప్సికమ్ తురుము - 1/4 కప్పు
ఉప్పు – తగినంత
అజినొమొటొ – చిటికెడు
కారం పొడి – 1/2 tsp
గరం మసాలా పొడి – 1/4 tsp
పోపు దినుసులు – 1/4 tsp
నూనె – 3 tsp
మైదాలో చిటికెడు ఉప్పు, కరిగించిన నెయ్యి లేదా డాల్డా వేసి తగినన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా తడిపి మూతపెట్టి ఉంచాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి కూరగాయల తురుము వేసి మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత అందులో అజినొమొటొ, కారం పొడి, తగినంత ఉప్పు, గరం మసాలా పొడి పూర్తిగా తడిపోయేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తడిపిన పిండిని తీసి బాగా మృదువుగా అయ్యేలా మర్ధనా చేసుకుని ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండతో పలుచగా చపాతీలా వత్తుకుని దీర్ఘచతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఒక ముక్క తీసుకుని మధ్యలో కొంచం కూర పెట్టి చాపలా చుట్టి చాక్లెట్ లా రెండువైపులా వత్తి పెట్టుకోవాలి. అన్నీ అలా చేసుకున్నాక వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని సాస్‌తో సర్వ్ చేయాలి. ఈ కూరలో పనీర్ తురుము. మీల్‌మేకర్ కూడా కలుపుకోవచ్చు.

Monday, October 14, 2013

కాకరకాయ.

గుత్తి కాకర:

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - నాలుగు, పల్లీలు - అర కప్పు, కొబ్బరి - అరకప్పు, ఎండు మిరపకాయలు - ఐదు, వెల్లుల్లి రేకలు - నాలుగు, ధనియాలు - ఒక టేబుల్ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 


తయారుచేయు విధానం:


పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి పల్లీలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకలు వేసి వేగించాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. మరో గిన్నెలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక కొబ్బరి తురుము వేసి ఎర్రగా వేగించాలి. చల్లారిన తర్వాత అందులో అర కప్పు పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కాకరకాయకి మధ్యలో గాటు పెట్టి విత్తనాలు తీసేసి అందులో ఈ కొబ్బరి మిశ్రమం కూరి నూనెలో వేగించాలి. 


చపాతి 


కావలసిన పదార్థాలు: 


కాకరకాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, గోధుమ పిండి - అరకిలో, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
కాకరకాయని పెద్ద ముక్కలు కోసి చింతపండు నీళ్లలో ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత వాటిని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో కొత్తిమీర తురుము, గోధుమ పిండి, కొద్దిగా నూనె, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత మనకి నచ్చిన సైజులో చపాతీలు చేసుకుని కాల్చుకోవాలి. చపాతీలు కొద్దిగా చేదుగా ఉన్నా...మధుమేహంతో బాధపడే వారికి ఈ చపాతీలు బాగా మేలు చేస్తాయి. 


కొబ్బరితో


కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - పావుకిలో, కొబ్బరి తురుము - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - ఐదు, వెల్లుల్లి రేకలు - ఐదు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - ఒక టీ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 


తయారుచేయు విధానం: 


కాకరకాయ ముక్కల్ని బాగా సన్నగా చక్రాలుగా కోసుకుని నాలుగు గంటలు ఎండలో ఆరబెట్టాలి. పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసి వేగించాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగాక ఉప్పు, పసుపు కొబ్బరి తురుము వేసి సన్ననిమంటపై వేగించి దించేయాలి. 


కాకర సబ్జీ


కావలసిన పదార్థాలు: కాకరకాయలు - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - నాలుగు, ఎండుమిరపకాయలు - మూడు, ధనియాలు - ఒక టేబుల్ స్పూను, శెనగపప్పు - పావు కప్పు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి రేకలు - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, చింతపండు - 20 గ్రాములు, పసుపు - కొద్దిగా - ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
ముందుగా ఎండుమిరపకాయలు, శెనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేగించుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయని పొట్టు తీసి చక్రాలుగా కోసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి ఒక పెద్దగ్లాసు చింతపండు నీళ్లు పోసి వేడెక్కాక అందులో కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించాలి. నీళ్లన్నీ పోయాక దించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి సన్ననిమంటపై మగ్గనివ్వాలి. దించేముందు శెనగపప్పు పొడి వేసి బాగా కలపి దించేయాలి. తీపిని ఇష్టపడేవారు శెనగపప్పు పొడి బదులు కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి. 


కాకర పకోడి


కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో, మొక్కజొన్న పిండి - ఒక కప్పు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కారం పొడి - ఒక టీ స్పూను, వంట సోడా - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి సన్నటి చక్రాల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్నపిండి, ధనియాల పొడి, కారం, వంట సోడా, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. పిండి బాగా పలుచగా ఉండేలా కలపాలి. లేదంటే ముక్కపై పిండి ఎక్కవగా ఉండి కాకరకాయ ముక్కలు వేగకుండా పచ్చిగా ఉంటాయి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక కాకరకాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేయాలి. ముక్కపై పిండి పలుచగా ఉండడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి. వీటిని చారన్నంలో కాని సాంబారన్నంలో కాని నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

Friday, October 11, 2013

రవ్వలడ్డు

 కావలసిన పదార్థాలు:--
బొంబాయి రవ్వ(గోధుమనూక) -- అరకేజీ
పంచదార -- అరకేజీ
నెయ్యి -- 1 కప్పు
యాలుకల పొడి -- 1 స్పూన్
కొబ్బరి పొడి -- 1 కప్పు
జీడిపప్పు & కిస్మిస్ -- 1/4 కప్పు
తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి,బాణలి పెట్టి, నెయ్యి వేడిచేసి, రవ్వను దోరగ వేయించి, ఒక పళ్ళెంలో వేసుకోవాలి. బాణలిలో కొంచెంగా నెయ్యివేసి, జీడిపప్పు & కిస్మిస్ ని వేసి దోరగా వేయించి, నూకమీద వెయ్యాలి. వెంటనే వేడి రవ్వలో పంచదార, కొబ్బరి పొడి, యాలుకల పొడి కలిపి రెండు నిముషాలు ఉంచాలి.రవ్వ వేడికి పంచదార కరిగి కొద్దిగా తడి అవ్వుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా బాగా కలిపి, మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. అంతే తియ్యనైన రవ్వలడ్డు రెడీ.

మినపసున్ని ఉండలు-

 కావలసిన పదార్థాలు:--
మినప్పప్పు -- కేజీ
పంచదార -- కేజీ లేదా బెల్లం
బియ్యం -- 1 కప్పు
నెయ్యి : 1/2 కేజీ
తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, మినప్పప్పుని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. కొంచెం చల్లారాక బియ్యాన్ని, మినప్పప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నెయ్యిని వేసి కరిగించి, మినపపొడి మీద వేసి బాగా కలిపి, మనకు కావలసినట్టు ఉండలు చుట్టుకోవాలి. అంతే నోట్లోవేస్తే కరిగిపోయే మినపసున్ని ఉండలు రెడీ.

Tuesday, October 1, 2013

దొండకాయ పెరుగుపచ్చడి

దొండకాయ పెరుగుపచ్చడి
దొండకాయలను నాలుగు పక్శాలుగాకోసి, వుడికించి చల్లార్చుకోవలి ఆతర్వాత పెరుగులో పచ్ఛిమిర్చి ద్దిగ ఆవపిండి,తగినంత వుప్పువెసి వుదికించిన దొండకలలొ కలుపుకోవాలి ఆతర్వాత బాణలీ లొ కొద్దిగానూనెవేసి,కరివెపాకు, పొపుగింజలు, కొద్దిగాఇంగువ వేసి పోపు పెట్టుకోవలి(కొద్దిగా పసుపు కూడ వెసుకొవాలి) అంతె దొండ కాయ పెరుగు పచ్చ్డి రెడీ, రైస్లోకి రుచిగా వుంటుంది.

సర్వ అప్ప లేక తప్పాల చెక్క

సర్వ అప్ప లేక తప్పాల చెక్క:

బియ్యపు పీండి వొక కప్పు తీసుకొని తగినంత వుప్పు, కారం, కొద్దిగా జీలకర్ర,కొద్దిగ శనగపప్పు,వేసి, వేడినీటితొ కలిపి,బాండ్లి లేదా పెనానికి నూనె రాసి తయారు చేసుకున్న పిండిని అద్దాలి ఆతర్వాత అద్దిన పిండికి మధ్యభాగములో చిల్లుపెట్టి, కొద్దిగా నూనె వెసి స్తొవె పై కాల్చుకోవాలి.గోల్ద్ కలర్లోకి వచిన తర్వాత దించుకొని సెర్వె చేసుకుంతె టేస్టీసర్వప్ప రెడీ (కావలనుకుంతె రుచి కొరకు కొన్ని నువ్వులు కూడా వెసుకోవచ్చు.

రాగి సున్నుండలు

రాగి సున్నుండలు:
రాగి పిండి 1 కప్పు,పంచదార 1కప్పు నెయ్యి1కప్పు, యాలకులపొడి కొద్దిగ
రాగిపిండిని బాణలి లో కొద్దిగ నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేదాక వెయించి, పంచదారను పౌడర్ చేసి వేయించిన రాగి పిండిలోకలుపుకొని, యాలకుల పౌడెర్ వేసి, వుండ కట్టడానికి సరిపడ నెయ్యివేసి వుండలు కట్టుకోవాలి రుచికి కొన్ని నువ్వులు వేయించుకొని యీ వుండలకు అద్దుకుంటె రుచికరమైన రాగి సున్నుండలు రెడీ.