వంకాయతో ఏవంట చేసినా అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.ఎన్ని కూరలున్నా, రోటి పచ్చళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు. మన తెలుగునాట చాలా రకాల వెరైటీ పచ్చళ్ళు చేస్తారు. వాటిలో ఈ పచ్చడి చాలా ముఖ్యమైనది. వంకాయ, టమాట కలిపి కూర చేసుకుంటాము. అదే విధంగా ఈ రెండింటితో పచ్చడి చేసుకుందాం. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది మరి.
కావలసిన పదార్థాలు:
వంకాయలు: 2(మీడియం సైజ్)
ఉల్లిపాయలు: 2(చిన్నకట్ చేసుకొన్నవి)
టమోటో: 1(కట్ చేసుకొన్నవి)
అల్లం: చిన్న పీస్(తురుమినది)
జీలకర్ర: 1tsp
జీలకర్రపొడి: 1tsp
దనియాపొడి: 1tbsp
కారం: 1tbsp
పచ్చిమిర్చి: 3
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర: (చిన్నగా కట్ చేసుకొన్నది)
బిర్యాని ఆకు: 1
నూనె: కావలసినంత
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిన్ వేసి అందులో వంకాయ ముక్కలు వేసి బాగే వేయించాలి. లేదా(స్టౌ సిమ్ లోపెట్టి వంకాయలను అలాగే కాల్చుకొంటే మంచి టేస్ట్ ఉంటుంది)
2. కాల్చిన వంకాయలను పక్కకు తీసి పైపొట్టు(నల్లగామారిన)ను తొలగించి. కొద్దిసేపు చల్లారనివ్వాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వంకాలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయముక్కలు, ఇంగువ, బిర్యాని ఆకు వేసి దోరగా వేయించాలి.
5. ఇప్పుడు అందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, టమోటో ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇవి వేగేటప్పుడే ఉప్పు వేసి త్వరగా వేగుతాయి. రుచిగాను తయారవుతుంది.
6. తర్వాత ముందుగా తయారు చేసిపెట్టుకొన్న వంకాయ పచ్చడిని పోపులో కలిపి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మిగిలిన పదార్థలన్నిటిని వేసి మూత పెట్టి మరికొద్దిసేప్ ఉడకనివ్వాలి. ఫైనల్ గా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి, అంతే స్పైసీ బైగాన్ బుర్తా రెడీ. ఈ పచ్చడి అన్నంలోకీ, చపాతీలోకీ కూడా బావుంటుంది.
0 comments:
Post a Comment