Monday, September 2, 2013

మసాలా ఇడ్లీ


కావలసిన పదార్థాలు:- 
మినప్పప్పు -- 1 కప్పు బియ్యం -- 3 కప్పులు క్యాబేజీ తురుము -- 1/4 కప్పు టమాట ముక్కలు -- 1/2 కప్పు బంగాళదుంపలు -- 1/2 కప్పు క్యారెట్ ముక్కలు -- 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు -- 1 కప్పు పచ్చిమిర్చి -- 4 వేరుశెనగ పప్పు (పల్లీలు) -- కొంచెంగా అల్లం పేస్టు -- 1 స్పూన్ కొత్తిమీర తురుము -- కొంచెంగా పోపు సామాన్లు ఉప్పు -- రుచికిసరిపడా 
తయారీవిధానం:-- మినప్పప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. రెండూ విడివిడిగానే రుబ్బుకొని, ఉప్పువేసి కలిపి రాత్రంతా పులియబెట్టాలి. తెల్లారాక కూరగాయముక్కల్ని కోసి, ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనెవేసి, పోపుసామన్లు వేసి, వేగాక ఉడికించిపక్కనపెట్టుకున్న కూరగాయముక్కల్ని, అల్లంపేస్టుని, కొత్తిమీర తురుముని అన్నీ వేసి, బాగా వేగిన తరవాత, ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపాలి. పిండిని నేయ్యిరాసిన ఇడ్లీ ప్లేటులో వేసి, 10 నిముషాలు స్టవ్ మీద ఉంచి దించుకోవాలి. అంతే వేడివేడి మసాలా ఇడ్లీ రెడీ. ఇడ్లీలలో చెట్నీ నంచుకొనే పనిలేదు. ఇష్టమైనవారు వారికి నచ్చిన చెట్నీలను నంచుకోవచ్చును.

0 comments:

Post a Comment