Wednesday, September 4, 2013

* మిల్క్‌ చాకోలెట్‌

కావాల్సినవి...

పాలు : ఒక లీటరు
పంచదార : 350 గ్రాములు
కోకో పౌడర్‌ : 25 గ్రాములు
రిఫైన్డ్‌ పిండి : 15 గ్రాములు
యాలకులు : ఐదు
నెయ్యి : ఒక టేబుల్‌ స్పూన్‌


 తయారు చేసే విధానం...

ముందుగా యాలకులపై పొరను తీసేసి అందులోని విత్తనాలను పొడి చేయండి. పాలను మరిగించండి. పాలలో సగం మిగిలే వరకు మరిగించాలి. తరువాత పాలలో పంచదారను, కోకో పొడిని, పిండిని వేసి మెల్లిగా కలిపి.. బుడగలు వచ్చేంత వరకు వేచి చూడండి. తరువాత అందులో కొంత నెయ్యిని వేసి కలపండి. కొంత వేడయ్యాక అప్పుడు మొత్తం నెయ్యిని కలపండి. కొంత సేపు తరువాత మంటను ఆపేయండి.యాలకుల పొడిని దానిపై చల్లి ..ఒక బౌల్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి.గడ్డకట్టాక మీకు నచ్చిన ఆకృతిలో కట్‌ చేసుకొండి. మిల్క్‌ చాకోలెట్‌ రెడీ.

0 comments:

Post a Comment