Friday, September 13, 2013

అవియల్ - కేరళ స్పెషల్

కేరళలో ప్రత్యేకంగా, చాలా సులభంగా..త్వరగా తయారు చేసుకొనే వంట అవియల్. ఇందులో వివిధ రకాల కూరగాయలనుపయోగించి వంటను తయారు చేస్తారు. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
క్యారెట్: 3
బీన్స్: 8
అరటికాయ: 1
పచ్చిబఠాణి: 1/2cup
తీపి గుమ్మడికాయ: చిన్న ముక్క
చౌచౌ: రెండు
క్యాబేజ్ తురుము: 1/2cup
బంగాళదుంపలు: 2
చామదుంపలు: 4
మసాలా కోసం:
పచ్చికొబ్బరి ముక్కలు: 1cup
పచ్చిమిరపకాయలు: 6
పుట్నాలపప్పు: 1/2cup
ధనియాలు: 3tsp
జీలకర్ర: 11/2cup
తాజా పెరుగు: 1cup
కొబ్బరి నూనె: 2tbsp
తయారుచేయు విధానం: 
1. ముందుగా కూరగాయలన్నింటిని పెద్దపెద్దగా తరిగిపెట్టుకోవాలి.
2. తర్వాత బంగాళదుంప, చేమదుంప తప్ప మిగిలిన కూరముక్కలన్నింటినీ ఉప్పునీటిలో ఉడికించుకోవాలి.
3. ఆ తర్వాత బంగాళదుంప, చేమదుంపల్లని ఉడికించాలి.
4. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, శెనగపప్పు, ధనియాలు, చెంచా జీలకర్ర తీసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పెరుగులో ఈ మిశ్రమాన్ని వేయాలి.
5. ఇందులో ముందుగా ఉడికించి నీరు వంపేసిన కూరగాయముక్కలన్నింటినీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత సన్నని మంట మీద ఉంచి, ఓ పదినిముషాలు ఉంచాలి.
6. దింపే ముందు కొబ్బరినూనెతో వేసిన జీలకర్ర తాలింపు, ఆతర్వాత కొత్తిమీర తరుగు, కరివేపాకుతో గార్నిష్ చేస్తే కమ్మని అవియల్ సిద్ధం.
7. ఇది చపాతీ, పూరీలనే కాదు..కప్పులో వేసుకుని తిన్నా కూడా ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

0 comments:

Post a Comment