Wednesday, September 4, 2013

బొజ్జ గణపయ్యకు ఇష్టమైన పాల ఉండ్రాళ్లు

విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు, ఉండ్రాళ్ళు ఒకటే. వినాయక చవితికి చాలా స్పెషల్ డిషెష్ ను వండుతుంటారు. దక్షిణ భారత దేశంలో ప్రజలు అప్పుడే వినాయకచవితి పిండివంటలు మొదలెట్టేసుంటారు. వినాయకచవితి సౌత్ స్టేట్స్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మరియు మహారాష్ట్రలలో చాలా పెద్ద పండుగ. ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
గణపతి చాలా ఫవర్ ఫుల్ గాడ్! అందుకే ఉండ్రాళ్ళు కూడా...చాలా పవర్ ఫుల్ ఫడ్!!
గణపతి విఘ్నాలను తొలగిస్తాడు. ఉండ్రాళ్ళు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. బొజ్జగణపయ్య చాలా ఇష్టంగా ఆరగించే ఉండ్రాళ్ళను భక్తితో వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన సంత్రుప్తి చెందుతాడు. మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి మన బొజ్జగణపయ్యకు ఈ వినయాక చవితి నాడు ఉండ్రాళ్ళతో పూజించి మరి వరాలు కురిపించమని కోరుకుందాం....!


కావలసిన పదార్థాలు :


బియ్యప్పిండి: 1cup
నీళ్లు: 21/2 cup
పంచదార: 1cup
కొబ్బరి తురుము: 1cup
పాలు: 1cup
సారపప్పు పొడి: 1/2cup
యాలకుల పొడి: 1/2 tsp


తయారుచేయు విధానం : 


1. ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి కలపకుండానే మూత పెట్టేసి చిన్న మంటపై నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పిండిని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ప్లేటులో ఉంచుకోవాలి.
3. ఇప్పుడు మరో పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో కొద్దిగా నీళ్లు పోసి, పంచదార కూడా వేసి మరిగించాలి.
4. మంట తగ్గించి అందులో కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత బియ్యప్పిండి ఉండలను అందులో వేసి పాలు పోసి మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి.
5. తరువాత సారపప్పు పొడి వేసి బాగా కలపాలి. పాకం కాస్త చిక్కగా అయ్యేటప్పుడు పైన యాలకుల పొడి చల్లి దించేయాలి.
అంతే బొజ్జగణపయ్యకు ఇష్టమైన పాల ఉండ్రాళ్ళు రెడీ..

0 comments:

Post a Comment