Friday, September 6, 2013

విఘ్నేశ్వరుడికి మోదక్

'బొజ్జగణపయ్య'ను చవితిరోజున 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మహారాష్ట్ర లో వినాయకుడికి తప్పనిసరిగా చేసేది మోదక్. ఇవి దాదాపు మన కుడుముల్లాగే ఉంటాయి.
గణనాథునికి ఇష్టమైన 'మోదక్ లను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి స్వామికి ఇష్టమైన ఈ మోదక్ వంటకాన్ని రెండు పద్దతుల్లో తయారు చేసుకోవచ్చు. ఒకటి ఉడకపెట్టడం, రెండో విధానం వేయించడం. సులవైన విధానంలో ఈ వంటకాలను తయారు చేసుకోవచ్చు..
మైదా 2 కప్పులు: 2tbsp
బియ్యపు రవ్వ: కొద్దిగా
నీళ్లు: నూనె సరిపడా
ఉప్పు: తగినంత
బెల్లం తురుము : 1cup
కొబ్బరి తురుము: 1cup
ఏలుకుల పొడి: 1/2tsp
నెయ్యి : 1 1/2tbsp
తయారీ విధానం : - 
1. ముందుగా మైదాలో, బియ్యపు రవ్వను కలిపి ఆ మిశ్రమానికి తగినంత నీటితో పాటు తగినంత ఉప్పును జోడించి మొత్తగా పిసుక్కోవాలి.
2. అనంతరం బాండీలో నూనెను పోసి వేడిచేసుకుండి. నూనె వేడెక్కిన తరువాత చిదుముకున్న బెల్లం, తరిగిన కొబ్బరి, ఏలుకల పొడితో నెయ్యిను కలిపి 10 నిమిషాల పాటు వేడిచేయండి. తయారైన పాకాన్ని దించుకుని చల్లబడేంత వరకు పక్కన పెట్టండి.
3. మొత్తగా కలుపుకుని పెట్టకున్న మైదా మిశ్రమాన్ని, చిన్న చిన్న వుండలుగా చేసుకుని అప్పచ్చిలా రోల్ చేసుకోండి
4. ఇలా అప్పచ్చిలా చేసుకున్న మైదా పదార్థం మధ్యలో, చల్లబడని పాకాన్ని ఇక టీ స్పూన్ పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయండి.
5. ఇలా తయారు చేసుకున్న'మోదక్'లను బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, వినాయకునికి నైవేద్యంగా పెట్టండి.

0 comments:

Post a Comment