Friday, September 13, 2013
Tuesday, September 10, 2013
ఉండ్రాళ్ళు
Published :
Tuesday, September 10, 2013
Author :
sukanya
కావాల్సిన పదార్ధాలు :-
బియ్యపురవ్వ -- ఒకటిన్నర గ్లాసు
సెనగపప్పు -- పావుగ్లాసు
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్స్
నీళ్ళు -- ముడు గ్లాసులు
తయారు చేసేవిధానం ;-
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మూడు గ్లాసుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి . ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో పావు గ్లాసు సెనగపప్పు వేసి రెండు పొంగులు రానివ్వాలి . ఇప్పుడు పొంగుతున్న నీళ్ళలో ఉప్పు వేసి మల్లి మళ్ళి ఒక పొంగు రానిచ్చి బియ్యపురవ్వను పోసి ఉండ కట్టకుండా దగ్గర పడేదాకా కలిపి మూత పెట్టాలి . ఒక ఐదు నిముషాల తరువాత మూత తీసి రవ్వ మెత్తగా వుడికిందో లేదో చూడాలి . ఉడికిన రవ్వను స్టవ్ మిద నుంచి దించేసి బాగా చల్లార నివ్వాలి . ఇప్పుడు చల్లారిన రవ్వను ఉండలుగా చేసి ఒక గిన్నెలో పెట్టి ఆవిరి మీద ఒక్క పదినిముషాలు ఉడక నివ్వాలి ...
Friday, September 6, 2013
విఘ్నేశ్వరుడికి మోదక్
Published :
Friday, September 06, 2013
Author :
sukanya
'బొజ్జగణపయ్య'ను చవితిరోజున 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మహారాష్ట్ర లో వినాయకుడికి తప్పనిసరిగా చేసేది మోదక్. ఇవి దాదాపు మన కుడుముల్లాగే ఉంటాయి.
గణనాథునికి ఇష్టమైన 'మోదక్ లను'
నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల
ప్రగాఢ విశ్వాసం. గణపతి స్వామికి ఇష్టమైన ఈ మోదక్ వంటకాన్ని రెండు
పద్దతుల్లో తయారు చేసుకోవచ్చు. ఒకటి ఉడకపెట్టడం, రెండో విధానం వేయించడం.
సులవైన విధానంలో ఈ వంటకాలను తయారు చేసుకోవచ్చు..
మైదా 2 కప్పులు: 2tbsp
బియ్యపు రవ్వ: కొద్దిగా
నీళ్లు: నూనె సరిపడా
ఉప్పు: తగినంత
బెల్లం తురుము : 1cup
కొబ్బరి తురుము: 1cup
ఏలుకుల పొడి: 1/2tsp
నెయ్యి : 1 1/2tbsp
తయారీ విధానం : -
1. ముందుగా మైదాలో, బియ్యపు రవ్వను కలిపి ఆ మిశ్రమానికి తగినంత నీటితో పాటు తగినంత ఉప్పును జోడించి మొత్తగా పిసుక్కోవాలి.
2. అనంతరం బాండీలో నూనెను పోసి వేడిచేసుకుండి. నూనె వేడెక్కిన తరువాత
చిదుముకున్న బెల్లం, తరిగిన కొబ్బరి, ఏలుకల పొడితో నెయ్యిను కలిపి 10
నిమిషాల పాటు వేడిచేయండి. తయారైన పాకాన్ని దించుకుని చల్లబడేంత వరకు పక్కన
పెట్టండి.
3. మొత్తగా కలుపుకుని పెట్టకున్న మైదా మిశ్రమాన్ని, చిన్న చిన్న వుండలుగా చేసుకుని అప్పచ్చిలా రోల్ చేసుకోండి
4. ఇలా అప్పచ్చిలా చేసుకున్న మైదా పదార్థం మధ్యలో, చల్లబడని పాకాన్ని ఇక టీ స్పూన్ పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయండి.
5. ఇలా తయారు చేసుకున్న'మోదక్'లను బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, వినాయకునికి నైవేద్యంగా పెట్టండి.
Thursday, September 5, 2013
వినాయకునికి ఇష్టమైన బెల్లం తాళికలు
Published :
Thursday, September 05, 2013
Author :
sukanya
కావలసినవి:
నీళ్ళు లేదా పాలు: 1glass
బియ్యప్పిండి: 1cup
బెల్లంతురుము: 2cups
ఎండుకొబ్బరి ముక్కలు: 2tbsp
జీడిపప్పు, బాదం పలుకులు: 1/2cup
ఏలకుల పొడి: 1tps
తయారు చేయు విధానం:
1. ముందుగా గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీరు లేదా పాలు పోసి స్టౌమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి.
2. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చల్లార్చాలి.
3. తర్వాత మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి.
4. ఉడికించిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి.
5. ఏలకుల పొడి వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి, ఇందులో కలపాలి.

Wednesday, September 4, 2013
బొజ్జ గణపయ్యకు ఇష్టమైన పాల ఉండ్రాళ్లు
Published :
Wednesday, September 04, 2013
Author :
sukanya
విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది.
ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు,
ఉండ్రాళ్ళు ఒకటే. వినాయక చవితికి చాలా స్పెషల్ డిషెష్ ను వండుతుంటారు.
దక్షిణ భారత దేశంలో ప్రజలు అప్పుడే వినాయకచవితి పిండివంటలు
మొదలెట్టేసుంటారు. వినాయకచవితి సౌత్
స్టేట్స్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మరియు మహారాష్ట్రలలో చాలా పెద్ద పండుగ.
ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
గణపతి చాలా ఫవర్ ఫుల్ గాడ్! అందుకే ఉండ్రాళ్ళు కూడా...చాలా పవర్ ఫుల్ ఫడ్!!
గణపతి విఘ్నాలను తొలగిస్తాడు. ఉండ్రాళ్ళు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. బొజ్జగణపయ్య చాలా ఇష్టంగా ఆరగించే ఉండ్రాళ్ళను భక్తితో వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన సంత్రుప్తి చెందుతాడు. మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి మన బొజ్జగణపయ్యకు ఈ వినయాక చవితి నాడు ఉండ్రాళ్ళతో పూజించి మరి వరాలు కురిపించమని కోరుకుందాం....!
కావలసిన పదార్థాలు :
బియ్యప్పిండి: 1cup
నీళ్లు: 21/2 cup
పంచదార: 1cup
కొబ్బరి తురుము: 1cup
పాలు: 1cup
సారపప్పు పొడి: 1/2cup
యాలకుల పొడి: 1/2 tsp
తయారుచేయు విధానం :
1. ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి కలపకుండానే మూత పెట్టేసి చిన్న మంటపై నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పిండిని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ప్లేటులో ఉంచుకోవాలి.
3. ఇప్పుడు మరో పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో కొద్దిగా నీళ్లు పోసి, పంచదార కూడా వేసి మరిగించాలి.
4. మంట తగ్గించి అందులో కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత బియ్యప్పిండి ఉండలను అందులో వేసి పాలు పోసి మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి.
5. తరువాత సారపప్పు పొడి వేసి బాగా కలపాలి. పాకం కాస్త చిక్కగా అయ్యేటప్పుడు పైన యాలకుల పొడి చల్లి దించేయాలి.
అంతే బొజ్జగణపయ్యకు ఇష్టమైన పాల ఉండ్రాళ్ళు రెడీ..

స్పైసీ బైగాన్ బుర్త(వంకాయ పచ్చడి)
Published :
Wednesday, September 04, 2013
Author :
sukanya
వంకాయతో ఏవంట చేసినా అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.ఎన్ని కూరలున్నా, రోటి పచ్చళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు. మన తెలుగునాట చాలా రకాల వెరైటీ పచ్చళ్ళు చేస్తారు. వాటిలో ఈ పచ్చడి చాలా ముఖ్యమైనది. వంకాయ, టమాట కలిపి కూర చేసుకుంటాము. అదే విధంగా ఈ రెండింటితో పచ్చడి చేసుకుందాం. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది మరి.
కావలసిన పదార్థాలు:
వంకాయలు: 2(మీడియం సైజ్)
ఉల్లిపాయలు: 2(చిన్నకట్ చేసుకొన్నవి)
టమోటో: 1(కట్ చేసుకొన్నవి)
అల్లం: చిన్న పీస్(తురుమినది)
జీలకర్ర: 1tsp
జీలకర్రపొడి: 1tsp
దనియాపొడి: 1tbsp
కారం: 1tbsp
పచ్చిమిర్చి: 3
ఇంగువ: చిటికెడు
కొత్తిమీర: (చిన్నగా కట్ చేసుకొన్నది)
బిర్యాని ఆకు: 1
నూనె: కావలసినంత
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిన్ వేసి అందులో వంకాయ ముక్కలు వేసి బాగే వేయించాలి. లేదా(స్టౌ సిమ్ లోపెట్టి వంకాయలను అలాగే కాల్చుకొంటే మంచి టేస్ట్ ఉంటుంది)
2. కాల్చిన వంకాయలను పక్కకు తీసి పైపొట్టు(నల్లగామారిన)ను తొలగించి. కొద్దిసేపు చల్లారనివ్వాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వంకాలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయముక్కలు, ఇంగువ, బిర్యాని ఆకు వేసి దోరగా వేయించాలి.
5. ఇప్పుడు అందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, టమోటో ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇవి వేగేటప్పుడే ఉప్పు వేసి త్వరగా వేగుతాయి. రుచిగాను తయారవుతుంది.
6. తర్వాత ముందుగా తయారు చేసిపెట్టుకొన్న వంకాయ పచ్చడిని పోపులో కలిపి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మిగిలిన పదార్థలన్నిటిని వేసి మూత పెట్టి మరికొద్దిసేప్ ఉడకనివ్వాలి. ఫైనల్ గా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి, అంతే స్పైసీ బైగాన్ బుర్తా రెడీ. ఈ పచ్చడి అన్నంలోకీ, చపాతీలోకీ కూడా బావుంటుంది.
* మిల్క్ చాకోలెట్
Published :
Wednesday, September 04, 2013
Author :
sukanya
కావాల్సినవి...
పాలు : ఒక లీటరు
పంచదార : 350 గ్రాములు
కోకో పౌడర్ : 25 గ్రాములు
రిఫైన్డ్ పిండి : 15 గ్రాములు
యాలకులు : ఐదు
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం...
ముందుగా యాలకులపై పొరను తీసేసి అందులోని విత్తనాలను పొడి చేయండి. పాలను మరిగించండి. పాలలో సగం మిగిలే వరకు మరిగించాలి. తరువాత పాలలో పంచదారను, కోకో పొడిని, పిండిని వేసి మెల్లిగా కలిపి.. బుడగలు వచ్చేంత వరకు వేచి చూడండి. తరువాత అందులో కొంత నెయ్యిని వేసి కలపండి. కొంత వేడయ్యాక అప్పుడు మొత్తం నెయ్యిని కలపండి. కొంత సేపు తరువాత మంటను ఆపేయండి.యాలకుల పొడిని దానిపై చల్లి ..ఒక బౌల్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి.గడ్డకట్టాక మీకు నచ్చిన ఆకృతిలో కట్ చేసుకొండి. మిల్క్ చాకోలెట్ రెడీ.

Tuesday, September 3, 2013
Monday, September 2, 2013
మసాలా ఇడ్లీ
Published :
Monday, September 02, 2013
Author :
sukanya
కావలసిన పదార్థాలు:-
మినప్పప్పు -- 1 కప్పు బియ్యం -- 3 కప్పులు క్యాబేజీ తురుము -- 1/4 కప్పు టమాట ముక్కలు -- 1/2 కప్పు బంగాళదుంపలు -- 1/2 కప్పు క్యారెట్ ముక్కలు -- 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు -- 1 కప్పు పచ్చిమిర్చి -- 4 వేరుశెనగ పప్పు (పల్లీలు) -- కొంచెంగా అల్లం పేస్టు -- 1 స్పూన్ కొత్తిమీర తురుము -- కొంచెంగా పోపు సామాన్లు ఉప్పు -- రుచికిసరిపడా
తయారీవిధానం:-- మినప్పప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. ఈ రెండూ విడివిడిగానే రుబ్బుకొని, ఉప్పువేసి కలిపి రాత్రంతా పులియబెట్టాలి. తెల్లారాక కూరగాయముక్కల్ని కోసి, ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనెవేసి, పోపుసామన్లు వేసి, వేగాక ఉడికించిపక్కనపెట్టుకున్న కూరగాయముక్కల్ని, అల్లంపేస్టుని, కొత్తిమీర తురుముని అన్నీ వేసి, బాగా వేగిన తరవాత, ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపాలి. ఈ పిండిని నేయ్యిరాసిన ఇడ్లీ ప్లేటులో వేసి, 10 నిముషాలు స్టవ్ మీద ఉంచి దించుకోవాలి. అంతే వేడివేడి మసాలా ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీలలో చెట్నీ నంచుకొనే పనిలేదు. ఇష్టమైనవారు వారికి నచ్చిన చెట్నీలను నంచుకోవచ్చును.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...