కావలసిన పదార్థాలు:(నలుగురికి సరిపడా)
కాకరకాయలు---4
పచ్చి మిరపకాయలు---2
చింతపండు---నిమ్మకాయంత
ఉద్దిపప్పు--3 స్పూన్స్
శనగ పప్పు---3 స్పూన్స్
నువ్వులు---3 స్పూన్స్
వేరుశనగ విత్తనాలు--3 స్పూన్స్
పసుపు--చిటికెడు
ఉప్పు---తగినంత
కారం---1/2 స్పూన్
ఆవాలు---1/4 స్పూన్
ఇంగువ---చిటికెడు
కరివేపాకు---2 రెమ్మలు
విధానము:
1.చింతపండు 20 నిముషాలు నానపెట్టి, జారుగా చింతపండు గుజ్జు/పులుసు తీసి పెట్టుకోవాలి.
2.ఉద్దిపప్పు,శెనగపప్పు,వేరుశనగ విత్తనాలు, నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
3.కాకరయాలు పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి.
4.పచ్చి మిరపకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
5.బానలి పెట్టి3 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక,1/4 స్పూన్ ఆవాలు వేసి చిట చిట అన్నాకా, ఇంగువ పసుపు వేయాలి.
6.తరువాత పొడవుగా కట్ చేసిన కాకరకాయలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
7.తరువాత మూత తీసి, ముక్కలు బాగా వేగినాక, చింతపండు పులుసు వేయాలి.
8.తరువాత చింతపండు పులుసులో ముక్కలు బాగా ఉడికినాక, గ్రైండ్ చేసిన పొడి, కారం వేయాలి.
9.తరువాత గుజ్జు గట్టి పడుతుంది.(చాల గట్టిగా ఉంటే కొద్దిగా నీరు వేసుకోవచ్చు)
10.తరువాత తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
11.చివరి లో కరివేపాకు వేసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే కాకరకాయ గుజ్జు/కాకరకాయ పులుసు రెడి. ఇది అన్నంలో కి బాగుంటుంది.
0 comments:
Post a Comment