Friday, June 21, 2013

పెసరపప్పు బొబ్బట్లు తయారీ విధానం

  పెసరపప్పు బొబ్బట్లు కావలసిన పదార్థాలు :-
పెసరపప్పు.. అర కేజీ
మైదాపిండి.. ముప్పావు కేజీ
యాలకులు.. ఆరు
ఉప్పు.. చిటికెడు
చక్కెర.. అర కేజీ
నెయ్యి లేదా నూనె.. పావు కేజీ
వంటసోడా.. చిటికెడు
పెసరపప్పు బొబ్బట్లు తయారీ విధానం :-
నీటిని మరిగించి, కడిగిన పెసరపప్పును వేసి బాగా ఉడికించి నీరు వార్చి ఐదు నిమిషాలపాటు ఆరబెట్టాలి. పెసరపప్పుకు పంచదార, యాలకుల పొడి కలిపి మరీ జారుగా లేదా మరీ గట్టిగా కాకుండా రుబ్బి, ఫ్రిజ్‌లో పది నిమిషాలుంచాలి. మైదాపిండిలో ఉప్పు, వంటసోడా, కరిగించిన నెయ్యి లేదా నూనె కలిపి పూరీల పిండిలాగా కలుపుకోవాలి. ప్రిజ్‌లోంచి పెసరపప్పు మిశ్రమాన్ని తీసి నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసి ఉంచాలి. పూరీల పీటమీద పిండి చల్లి మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా తీసి పూరీల్లా వత్తాలి. ఇప్పుడా పూరీలలో పెసరముద్దను ఉంచి కొసలు మూసివేసి మెల్లిగా చపాతీలాగా చేయాలి. అలా మొత్తం చేసుకున్నాక.. పెనంపై నూనె లేదా నెయ్యి వేసి ఒక్కోదాన్ని రెండువైపులా ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి పెసర బొబ్బట్లు తయార్..!

0 comments:

Post a Comment