Sunday, June 30, 2013

రాగిపిండి ఇడ్లి

 కావలసిన పదార్ధాలు :-

మినపప్పు : వంద గ్రాములు
బియ్యపురవ్వ : వంద గ్రాములు
రాగిపిండి : వంద గ్రాములు
ఉప్పు : తగినంత

తయారుచేయు విధానం :-

1) మినపప్పును ఐదు గంటలు నానబెట్టి, కడిగి మెత్తగా రుబ్బాలి. దీనిలో
రాగిపిండి, కడిగి నీళ్ళు, పిండిన బియ్యపురవ్వను రుబ్బినపిండిలో కలిపి
ఐదు గంటలు పులియనివ్వాలి.
2) ఇడ్లి వేసేముందు ఉప్పు, కొంచెం వంటసోడా కలిపి, స్టవ్ వెలిగించి ఇడ్లి
పాత్ర లో కొద్దిగా నీళ్ళు పోసి ఇడ్లి రేకులో ఇడ్లిలా వేసి పావుగంట
ఉడకనివ్వాలి.

* అంతే రాగి ఇడ్లి రెడి.

అరటికాయ పెరుగు పచ్చడి :




అరటికాయ పెరుగు పచ్చడి :

కావలసిన పదార్థాలు
అరటికాయలు. 2
పచ్చిమిర్చి. 4
ధనియాలు. 2 టీస్పూ//.
చింతపండు. 25 గ్రా.
వెల్లుల్లి. పది రేకలు
జీలకర్ర. 5 గ్రా.
పెరుగు. 1/4 లీ.
ఉల్లిపాయ. 1
కరివేపాకు. 2 రెబ్బలు
కొత్తిమీర. 1 కట్ట
ఆవాలు. 1/2 టీస్పూ//.
నూనె. సరిపడా
ఉప్పు. తగినంత

తయారీ విధానం

అరటికాయలు తొక్కు తీసి ముక్కలుగా కోసి ఉడకబెట్టాలి. బాణెలి లో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, దనియాలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి వేయించాలి.

చింతపండు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు , పచ్చిమిర్చి పోపు. అన్నీ మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా రుబ్బాలి.

ఇందులో పెరుగు వేసి కలపాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలుతో పోపు చేసి పచ్చడిలో కలిపితే పెరుగు పచ్చడి రెడీ
.

Friday, June 21, 2013

పెసరపప్పు బొబ్బట్లు తయారీ విధానం

  పెసరపప్పు బొబ్బట్లు కావలసిన పదార్థాలు :-
పెసరపప్పు.. అర కేజీ
మైదాపిండి.. ముప్పావు కేజీ
యాలకులు.. ఆరు
ఉప్పు.. చిటికెడు
చక్కెర.. అర కేజీ
నెయ్యి లేదా నూనె.. పావు కేజీ
వంటసోడా.. చిటికెడు
పెసరపప్పు బొబ్బట్లు తయారీ విధానం :-
నీటిని మరిగించి, కడిగిన పెసరపప్పును వేసి బాగా ఉడికించి నీరు వార్చి ఐదు నిమిషాలపాటు ఆరబెట్టాలి. పెసరపప్పుకు పంచదార, యాలకుల పొడి కలిపి మరీ జారుగా లేదా మరీ గట్టిగా కాకుండా రుబ్బి, ఫ్రిజ్‌లో పది నిమిషాలుంచాలి. మైదాపిండిలో ఉప్పు, వంటసోడా, కరిగించిన నెయ్యి లేదా నూనె కలిపి పూరీల పిండిలాగా కలుపుకోవాలి. ప్రిజ్‌లోంచి పెసరపప్పు మిశ్రమాన్ని తీసి నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసి ఉంచాలి. పూరీల పీటమీద పిండి చల్లి మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా తీసి పూరీల్లా వత్తాలి. ఇప్పుడా పూరీలలో పెసరముద్దను ఉంచి కొసలు మూసివేసి మెల్లిగా చపాతీలాగా చేయాలి. అలా మొత్తం చేసుకున్నాక.. పెనంపై నూనె లేదా నెయ్యి వేసి ఒక్కోదాన్ని రెండువైపులా ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి పెసర బొబ్బట్లు తయార్..!

తోటకూర వడలు

తోటకూర వడలు :-
మినపప్పు : అరకిలో
తోటకూర : రెండు కట్టలు
కొత్తిమీర : ఒక కట్ట
ఉల్లిపాయలు : రెండు
జీలకర్ర : ఒక స్పూన్
పచ్చిమిర్చి : రెండు
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడ

తయారు చేయు విధానం :-
...................................
మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలానే కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మినపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి తరిగిపెట్టుకున్న వాటిని జత చేసి చక్కగా కలుపుకోవాలి. దీనిలోనే ఉప్పు, జీలకర్ర వేయాలి. ఈ మిశ్రమాన్ని పాలకరవ్ పై వడల్లా వత్తుకోవాలి. బాణలీలో నూనె పోసి బాగా కాగనిచ్చి కవర్ పై వత్తుకున్న వడలను వేయించుకోవాలి. అంతే మనకు రుచికరమైన తోటకూర వడలు రెడీ. వీటిని అల్లం చెట్నీతో గానీ, కొబ్బరి చెట్నీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు

Thursday, June 20, 2013

రాగి సంకటి :

రాగి సంకటి :

భారతదేశంలో ఎక్కువగా వరి అన్నం తింటారు. కాని అందులో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే అధిక శాతం మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతూ ఉంటారు. కాని బియ్యంతో పోలిస్తే రాగులలోనే ఎక్కువ పోషక పదార్ధాలు ఉన్నాయి. అందుకే డాక్టర్లు కూడా జబ్బు పడినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు రాగి జావ , సంకటి లేదా రొట్టెలు తినమంటారు. అంతే కాదు రాగి అంబలి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారు. మజ్జిగతో చేసిన రాగి అంబలి వేసవిలో చాలా మంచిది. అది వేడిని తగ్గిస్తుంధి.. తెలుగువారికందరికి బాగా పరిచయమైన, ఇష్టమైన రాగి సంకటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మరి. చాలా సులువు..
కావలసిన వస్తువులు:

రాగి పిండి – 1 కప్పు
బియ్యం – ½ కప్పు
ఉప్పు – తగినంత

అరకప్పు బియ్యంలో రెండు కప్పుల నీళ్లు పోసి చాలా మెత్తగా ఉడికించాలి. మళ్లీ ఇంకో కప్పు నీళ్లు పోసి ఉడికించి నీరంతా ఇగిరిపోకముందే మంట తగ్గించి అన్నంపైన రాగిపిండి సమానంగా పోసి మూతపెట్టాలి. మంట తగ్గించి 5 నిమిషాలు అలాగే ఉడికించాలి. అందులో ఉన్న నీటి వేడికి రాగిపిండి పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మొత్తం అన్నం, రాగిపిండి కలిసి మెత్తగా ముద్దలా అయ్యేంతవరకు పప్పు గుత్తితో మెదపాలి. ఇది చాలా వేగంగా, వేడిగా ఉన్నప్పుడే చేయాలి. ఇందులో అన్నం, పిండి కలిసిపోయి ముద్దలా అవ్వాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తడి చేతులతో గుండ్రంగా ముద్దలు చేసుకుని పప్పు, పచ్చిపులుసు, పల్లీ పచ్చడి లేదా కోడికూర, మటన్, చేపల పులుసుతో వడ్డించాలి..

కొన్ని చిట్కాలు :

దీనికోసం వండిన అన్నం, ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే కూడా ఉపయోగించవచ్చు. అన్నంలో మరిన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించి రాగిపిండి కలపాలి.

సగం రాగిపిండి నీళ్లల్లో కలిపి అన్నంలో వేయాలి. మిగతాపిండి అలాగే అన్నంమీద పోయాలి. తర్వాత మెదపాలి.

ఈ సంకటి లేదా ముద్ద చిన్నగిన్నెకంటే పెద్ద గిన్నెలో తయారు చేసుకుంటే తడి చేసుకుని ముద్దలు చేయడం సులువవుతుంది..

Saturday, June 8, 2013

అలసందల వడ



కావలసిన పదార్థాలు:

అలసందలు –1 కప్
పచ్చి మిర్చి--5
అల్లం--చిన్న ముక్క
సోంపు--1//2 స్పూన్
కరివేపాకు--5
ఉల్లిపాయ--1
ఉప్పు--తగినంత
నూనె--2 కప్స్ (వేయించడానికి)

విధానము:

1.అలసందలు 3-4 గంటలు నాన పెట్టాలి.

2.మిక్సీ జార్ లో నానపెట్టిన అలసందలు, అల్లం, సోంపు, ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేయాలి.(అవసరమైతే కొద్దిగా నీరు చిలకరించవచ్చు )

3.ఉల్లిపాయలు, కరివేపాకు చిన్నగా తరిగి, గ్రైండ్ చేసిన పిండి లో కలపాలి.

4.నూనె వేడికి పెట్టి, వేడి చేయాలి.

5.పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని, చేతికి మధ్య లో పెట్టుకొని చిన్నగా వత్తి, నూనె లో వేయాలి.

6.వడను రెండు వైపులా ఎర్రగా వేయించాలి.

7.తరువాత వేయించిన వడలను ప్లేట్ లో పెట్టుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే అలసందల వడ రెడి.


సగ్గు బియ్యం- పెరుగు పకోడి

కావలసిన పదార్థాలు:

సగ్గు బియ్యం--1 కప్
పెరుగు --౩ స్పూన్స్
బియ్యప్పిండి--1/4 కప్
పచ్చి మిర్చి---2 లేక 3
అల్లం---చిన్న ముక్క
కరివేపాకు--2 రెమ్మలు
జీలకర్ర--1/4 స్పూన్స్
ఉప్పు---తగినంత
ఇంగువ—చిటికెడు
నూనె---2 కప్స్ వేయించడానికి


విధానము:

1.సగ్గుబియ్యం లో పెరుగు వేసి ,సగ్గు బియ్యం మునిగేలా నీరు వేసి, 2 లేక 3 గంటలు నానపెట్టాలి.

2.తరువాత,పెరుగులో నానపెట్టిన సగ్గు బియ్యం, అల్లం, మిర్చి, కరివేపాకు వేసి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేయాలి.

3.తరువాత గ్రైండ్ చేసిన పిండి గట్టి పడ్డానికి బియ్యప్పిండి వేసి పకోడి పిండి లా కలుపుకోవాలి.

4.తరువాత జీలకర్ర, ఇంగువ ,ఉప్పు వేసి బాగా కలపాలి.

5.తరువాత కలిపిన పిండిని చిన్న ఉంటగా చేసుకొని పకోడిలా చేయాలి.

6.నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక పకోడీలు వేసి రెండు వైపులా కొంచం కలర్ మారేలా వేయించాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే పెరుగు సగ్గు బియ్యము పకోడి రెడి.

పొంగలి వడ

పొంగలి వడ

కావలసిన పదార్థాలు:

అన్నం పొంగలి/కిచిడి---1 కప్
బియ్యప్పిండి---1 కప్
ఉప్పు---తగినంత
ఎర్ర కారం---1/2 స్పూన్
నూనె--- వేయించడానికి

పొంగలి విధానము:

1.1/2 కప్ బియ్యం,1/2 కప్ పెసర పప్పు

2.ఒక గిన్నె లో బియ్యం ,పెసర పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర ,1/2 స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కుక్కర్ లో పెట్టాలి.

3.2 లేక 3 విసిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేయాలి.

పొంగలి వడ చేసే విధానం:

1.ఒక గిన్నె లో పొంగలి, బియ్యప్పిండి, ఉప్పు, ఎర్ర కారం వేసి, గోరు వెచ్చటి నీళ్ళు వేసి వడ చేయడానికి వీలుగా కలుపుకోవాలి.(పొంగలి లో ఉప్పు ఉన్నందున కొంచం తక్కువ వేసుకుంటే సరిపోతుంది.

2.పొంగలి మిశ్రమాన్ని చిన్న ఉంటగా తీసుకొని వడలా చేసుకోవాలి.

3.నూనె వేడి పెట్టి, వేడి అయ్యాక వడలు వేసుకోవాలి.

4.వడలు రెండు వైపులా గోధుమ రంగులా వేగినాక ఒక ప్లేట్ లో తీసుకోవాలి.

ఎంతోరుచిగా ఉండే పొంగలి వడ/కిచిడి వడ రెడి.ఈ వడలు టమోటా సాస్ తో తింటే చాలా బాగుంటుంది.

చిట్కా:మిగిలిపోన పొంగలి తో కూడా వడలు వేసుకోవచ్చు.


సగ్గు బియ్యం- పెరుగు వడ

సగ్గు బియ్యం- పెరుగు వడ

కావలసిన పదార్థాలు:

సగ్గు బియ్యం--1 కప్
పెరుగు --౩ స్పూన్స్
బియ్యప్పిండి--1/4 కప్
పచ్చి మిర్చి---2 లేక 3
అల్లం---చిన్న ముక్క
కరివేపాకు--2 రెమ్మలు
జీలకర్ర--1/4 స్పూన్స్
ఉప్పు---తగినంత
ఇంగువ—చిటికెడు
బ్లాక్ సాల్ట్---1/4 స్పూన్స్
నూనె---2 కప్ వేయించడానికి

విధానము:

1.సగ్గుబియ్యం లో పెరుగు వేసి ,సగ్గు బియ్యం మునిగేలా నీరు వేసి, 2 లేక 3 గంటలు నానపెట్టాలి.

2.తరువాత,పెరుగులో నానపెట్టిన సగ్గు బియ్యం, అల్లం, మిర్చి, కరివేపాకు వేసి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేయాలి.

3.తరువాత గ్రైండ్ చేసిన పిండి గట్టి పడ్డానికి బియ్యప్పిండి వేసి పకోడి పిండి లా కలుపుకోవాలి.

4.తరువాత జీలకర్ర, ఇంగువ ,ఉప్పు వేసి బాగా కలపాలి.

5.తరువాత కలిపిన పిండిని చిన్న ఉంటగా చేసుకొని వడలా చేయాలి.

6.నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక వడలు వేసి రెండు వైపులా కొంచం కలర్ మారేలా వేయించాలి.

7.ఇలా వేయించిన సగ్గు బియ్యం వడలపై, బ్లాక్ సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

ఎంతో రుచిగా ఉండే పెరుగు సగ్గు బియ్య్యము వడ రెడి.

కాకరకాయ పులుసు





కావలసిన పదార్థాలు:(నలుగురికి సరిపడా)

కాకరకాయలు---4
పచ్చి మిరపకాయలు---2
చింతపండు---నిమ్మకాయంత
ఉద్దిపప్పు--3 స్పూన్స్
శనగ పప్పు---3 స్పూన్స్
నువ్వులు---3 స్పూన్స్
వేరుశనగ విత్తనాలు--3 స్పూన్స్
పసుపు--చిటికెడు
ఉప్పు---తగినంత
కారం---1/2 స్పూన్
ఆవాలు---1/4 స్పూన్
ఇంగువ---చిటికెడు
కరివేపాకు---2 రెమ్మలు

విధానము:

1.చింతపండు 20 నిముషాలు నానపెట్టి, జారుగా చింతపండు గుజ్జు/పులుసు తీసి పెట్టుకోవాలి.

2.ఉద్దిపప్పు,శెనగపప్పు,వేరుశనగ విత్తనాలు, నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.

3.కాకరయాలు పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి.

4.పచ్చి మిరపకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.

5.బానలి పెట్టి3 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక,1/4 స్పూన్ ఆవాలు వేసి చిట చిట అన్నాకా, ఇంగువ పసుపు వేయాలి.

6.తరువాత పొడవుగా కట్ చేసిన కాకరకాయలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

7.తరువాత మూత తీసి, ముక్కలు బాగా వేగినాక, చింతపండు పులుసు వేయాలి.

8.తరువాత చింతపండు పులుసులో ముక్కలు బాగా ఉడికినాక, గ్రైండ్ చేసిన పొడి, కారం వేయాలి.

9.తరువాత గుజ్జు గట్టి పడుతుంది.(చాల గట్టిగా ఉంటే కొద్దిగా నీరు వేసుకోవచ్చు)

10.తరువాత తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

11.చివరి లో కరివేపాకు వేసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే కాకరకాయ గుజ్జు/కాకరకాయ పులుసు రెడి. ఇది అన్నంలో కి బాగుంటుంది.

Saturday, June 1, 2013

వెజ్ పావ్ బాజీ.




కావలసిన పదార్ధాలు:
పావ్: ఒక పాకెట్
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2-4
కరివేపాకు: రెండు రెమ్మలు
టమాటాలు: 3
ఉప్పు, కారం: రుచికి సరిపడా
పసుపు: 1/2tsp
పావ్ భాజీ మసాలా: 2tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
కొత్తిమీర: ఒక కట్ట
నిమ్మకాయ: ఒకటి
నూనె: సరిపడా
నెయ్యి : 2tbsp
ఆలూ(బంగాళదుంప): 3
కారట్, కాప్సికం, కాలిఫ్లవర్, పచ్చిబటానీ, కాబేజ్, బీన్స్: 1cup(అన్నీ కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసినవి)

తయారు చేయు విధానం:

1.
ముందుగా పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

2.
ఇప్పుడు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి బాగా మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, పావ్ భాజీ మసాలా వేసి నూనె తేలేవరకూ వేయించాలి.

3.
ఇప్పుడు తరిగిన కూరగాయలు అన్నీ వేసి రెండు నిమిషాలు వేయించి తగినంత ఉప్పు, నీళ్ళు పోసి, మూతపెట్టి అయిదారు విజిల్స్ రానివ్వాలి.

4.
కక్కర్ క్రిందికి దింపుకొని స్టీం(ఆవిరి)అంతా పోయాక ఉడికిన కూరగాయలని మెత్తగా మెదిపి రెండునిమిషాలు కూర చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దింపెయ్యాలి.

5.
తర్వాత పావ్ ని మధ్యకి కట్ చేసి నెయ్యి వేడి చేసి పేనం పై కొంచెం వేయించాలి. వేడివేడిగా పావ్ లను కూరతో సర్వ్ చేస్తే ఘుమఘుమలాడే పావ్ భాజీ ఊరిస్తుంది.

సర్వ్ చేసేటప్పుడు కూరలో నిమ్మరసం పిండి కొత్తిమీర తరగును గార్నిష్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.