Saturday, May 4, 2013

చింతచిగురు పొడి



చింతచిగురు పొడి

కావలసినవి:
చింత చిగురు - 250 గ్రాములు, ఎండు మిర్చి - 15, ఎండు కొబ్బరిపొడి - 50 గ్రాములు, జీలకర్ర - ఒక స్పూన్, ఉప్పు - తగినంత, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, కరివేపాకు - ఒక కట్ట, శెనగపప్పు - వందగ్రాములు, నువ్వులు, నూనె - రెండు ్పూన్లు.

తయారీ: చింతచిగురు శుభ్రం చేసుకుని చేతితో మెదపాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి సన్నటి సెగ మీద వేగించాలి. మిగిలిన నూనెలో శెనగపప్పు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి. ఇవన్నీ చల్లారాక అన్నీ కలిపి పొడి చేయాలి. చివరగా కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఇది అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా బాగుంటుంది.

సేకరణ: ఎస్. ఎస్. లక్ష్మి, వైజాగ్

0 comments:

Post a Comment