Saturday, May 4, 2013

చింతచిగురు పులిహోర



చింతచిగురు పులిహోర

కావలసినవి:
అన్నం - రెండు కప్పులు, చింత చిగురు - ఒక కప్పు, పసుపు- చిటికెడు, నూనె - ఐదు స్పూన్లు, పల్లీలు - కొద్దిగా, పోపు కోసం - ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఉప్పు తగినంత.

తయారీ: చింత చిగురుని కాడలు లేకుండా శుభ్రం చేసుకుని కడిగి ఆరపెట్టుకోవాలి. తరువాత నూనెలో చింత చిగురు వేగించాలి. అదే కళాయిలో పోపు దినుసులు కూడా వేగించుకోవాలి. తరువాత చల్లారిన అన్నంలో చింతచిగురు, పసుపు, ఉప్పు, పోపు గింజలు వేసి కలుపుకోవాలి. పులిహోర కలిపేటప్పుడు మెతుకు విరగకుండా జాగ్రత్తపడాలి.

కమ్మటి చిగురు పులిహోర రెడీ.

0 comments:

Post a Comment