Monday, May 6, 2013

మొక్కజొన్న చిప్స్



మొక్కజొన్న చిప్స్

మొక్కజొన్నపిండి - ఒకటిన్నర కప్పు,
మైదాపిండి - 1 కప్పు,
నూనె (పిండిలో కలపడానికి) - 1 టేబుల్ స్పూను,
ఉప్పు - రుచికి సరిపడా,
కొత్తిమీర తరుగు - 1 కప్పు,
ఎండుమిర్చి (సన్నముక్కలు) - 1 టీ స్పూను,
నూనె - (చిప్స్ వేగించడానికి) సరిపడా.

తయారుచేసే విధానం:-
...........................

ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా పిండి, ఉప్పు, మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూను నూనె వేసి గోరువెచ్చని నీటితో గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ముద్దని గంట పాటు నానబెట్టి, చపాతీల్లా వత్తుకుని చాకుతో మీకు ఇష్టమైన ఆకారాల్లో (చిప్స్గా) కట్ చేసుకోవాలి. తర్వాత నూనెలో దోరగా (కరకరలాడేలా) వేగించుకోవాలి. చిప్స్ని పిల్లలతో పాటు పెద్దలూ ఇష్టంగా తింటారు

0 comments:

Post a Comment