Friday, May 17, 2013

సగ్గు బియ్యం తో ఉప్మా



సగ్గు బియ్యం తో ఉప్మా

సగ్గుబియ్యం ఉప్మా అప్పటికప్పుడు చేయగలిగేది కాదు. కనీసం ఆరేడు గంటలు సమయం పట్టేది. ముందుగా కొంచం పల్చగా ఉన్న మజ్జిగ తీసుకుని, ఫ్రిజ్ చల్లదనం నుంచి నార్మల్ టెంపరేచర్ కి వచ్చే వరకూ ఓపిక పట్టండి. వచ్చాక అందులో సగ్గుబియ్యం నానబొయ్యండి. గిన్నె మీద మూత పెట్టేశారంటే ఐదారు గంటల వరకూ అటు చూసే పనుండదు. ఉదయాన్నే ఉప్మా చేయాలనుకుంటే రాత్రి నిద్రపోయేటప్పుడు నానబెట్టే పని పెట్టుకోవాలన్న మాట.

సగ్గుబియ్యం చక్కగా నానిపోయి, పైన మీగడ తరక కూడా కట్టింది కదూ. స్పూన్ తో నానిన సగ్గుబియ్యాన్ని కదపండి. నానిన సగ్గుబియ్యంలో మూడో వంతు పరిమాణంలో ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని బట్టి ఎన్ని ఉల్లిపాయలు కావాలో నిర్ణయించుకోండి. పచ్చిమిర్చి పెద్దవైతే రెండు, చిన్నవైతే మూడు.. అంతకన్నా ఎక్కువ అనవసరం.. ఇది కమ్మగా ఉండే వంటకం కాబట్టి కారం బాగుండదు. ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కుని, పచ్చిమిర్చిని నిలువుగా సన్నగా చీల్చుకోండి.

ఇష్టదైవాన్ని తల్చుకుని బాండీ స్టవ్ మీద పెట్టండి. స్టవ్ వెలిగించాక, నాలుగు స్పూన్ల నూనె పోయండి. నూనె కాగుతుండగానే తగుమాత్రం పల్లీలు (మీకు ఇష్టమైతే కొంచం ఎక్కువగానే వేసుకోవచ్చు), అవి వేగుతున్నాయనగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించండి. డీప్ ఫ్రై అన్న మాట. ఇప్పుడు పచ్చి మిర్చి వేసి తిప్పు తిప్పి, ఉల్లి ముక్కలు బాండీలోకి జారవిడవండి. పక్క స్టవ్ ఖాళీగానే ఉంది కదా, దాని మీద గిన్నె పెట్టి, అర గ్లాసు నీళ్ళు పోసి, అవి మరుగుతుండగా చిటికెడు పసుపు వేయండి.

నాలుగు చెంచాల పెసరపప్పు చిన్న బౌల్ లోకి తీసుకుని బాగా కడిగి, మరుగుతున్న పసుపు నీళ్ళలో జారవిడవండి. పప్పుని మరీ ఎక్కువగా ఉడకనివ్వకుండా, వడపప్పు లా అవ్వగానే స్టవ్ కట్టేసి, మిగిలిన నీళ్ళు పారబోసేయండి. బాండీలో ఉల్లి ముక్కలు బంగారు రంగు వస్తున్నాయనగా నానిన సగ్గుబియ్యాన్ని జాగ్రత్తగా బాండీ లోకి దించండి. గరిటెతో నెమ్మదిగా కలుపుతూ ఉంటే ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం పెద్దవై ముత్యాలని తలపిస్తాయి. సరిగ్గా ఇప్పుడే ఉడికిన పెసరపప్పుని బాండీ లోకి దించి, తిప్పు తిప్పి, తగినంత ఉప్పు వేసి మరో తిప్పు తిప్పాలి. పచ్చి కొబ్బరి తురుము ఉంటే అది కూడా కప్పు వేసుకోవచ్చు. లేకపోయినా నష్టం లేదు.

ఒక్క నిమిషమాగి స్టవ్ కట్టేసి, సన్నగా తురిమిన కొత్తిమీర గార్నిష్ చేసేస్తే సగ్గుబియ్యం ఉప్మా రెడీ. చట్నీలు, సాస్లు ఏవీ అవసరం లేకుండా నేరుగా ఆరగించేయడమే. వేడిగానూ, చల్లగానూ కూడా బాగుండే వంటకం ఇది. ఉప్మా మజ్జిగ వాసన అస్సలు రాదు. మజ్జిగ వాడామని మనం చెబితే తప్ప తెలీదన్న మాట.

పాలకోవా కావలసినవి:-



పాలకోవా కావలసినవి:-

పాలు - లీటరు
పంచదార - పావుకిలో,
నెయ్యి - టీ స్పూను

పాలకోవా తయారి:-
.......................
మందపాటి గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టి బాగా దగ్గరపడే వరకు అంటే పాలు నాలుగో వంతు అయ్యేవరకు ఆపకుండా కలుపుతుండాలి. తర్వాత పంచదార వేని తక్కువ మంటమీద కలపాలి. మిశ్రమం ముద్దగా అయిన తరవాత నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకొని కావలసిన ఆకారంలో తయారు చేసుకోవాలి. రుచికరమైన పాలకోవా తయారు.

Wednesday, May 8, 2013

కాలిప్లవర్‌ పరోట కావలసిన పదార్థాలు :-



కాలిప్లవర్పరోట కావలసిన పదార్థాలు :-

గోధుమపిండి - రెండు కప్పులు
కాలీఫ్లవర్తురుము - పావు కప్పు
సోంపు - ఒక టీస్పూన్
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - పావు కప్పు
ధనియాల పొడి - ఒక టీస్పూన్
గరం మసాలా - అర స్పూను
అల్లంపేస్టు - ఒక స్పూను

తయారు చేసే విధానం :-

క్యాలీఫ్లవర్తురుము, ఉప్పు, మిర్చి, అల్లం ముక్కలు, ధనియాల పొడి అన్ని పదార్థాలను కలిపి వుంచాలి. క్యాలీఫ్లవర్ను కడిగి తుడిచి తురుముకోవాలి. గోధుమపిండిని తడిపి ఉంచాలి. పది నిమిషాల ముందే కాలీఫ్లవర్మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శనగపిండిని కాని కలిపితే తడి ఉండదు. గోధుమ పిండిని ఉండలు చేసి క్యాలీఫ్లవర్మిశ్రమాన్ని స్టఫ్చేసి, పరోటాల మాదిరిగా రొట్టెల పీటమీద వేసి రోల్చేయాలి. పెనం మీద మీడియం ఫ్లేమ్మీద కా ల్చాలి. కాలాక దించే ముందు కొద్దిగా బటర్రాస్తే రుచిగా వుంటా యి. పరోటాలను పెరుగు, వెన్న ఊరగాయలతో తీసుకోవచ్చు.

మినప జంతికలు కావలసినవి:



మినప జంతికలు కావలసినవి:

బియ్యం - 3 కప్పులు,
మినప్పప్పు - కప్పు,
వాము - టీ స్పూను,
ఉప్పు, కారం - తగినంత,
నూనె - వేయించడానికి తగినంత

మినప జంతికలు తయారి:-

మినప్పప్పును గోధుమరంగు వచ్చేవరకు వేయించి, చల్లారాక బియ్యంతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, వాము, గరిటెడు నూనె వేసి కలపాలి. తగినంత నీరు పోసి ముద్దలా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. జంతికల గొట్టంలో పిండి ముద్దను పెట్టి, కాగుతున్న నూనెలో జంతికల మాదిరి ఒత్తుకోవాలి. రెండువైపులా దోరగా వేగాక తీసేయాలి