Tuesday, April 5, 2016

కావల్సినవి: చింతకాయలు - పది నుంచి పన్నెండు, అన్నం - కప్పు, సెనగపప్పూ, మినప్పప్పు - రెండూ కలిపి టేబుల్‌స్పూను, ఆవాలు - చెంచా, పల్లీలు - టేబుల్‌స్పూను, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఇంగువ - పావుచెంచా, పసుపు - అరచెంచా, ఉప్పు - తగినంత, తెల్ల నువ్వులపొడి - టేబుల్‌స్పూను, నూనె - టేబుల్‌స్పూను.
తయారీ:: చింతకాయల్ని తొక్కు తీసేసి అందులో రెండు పచ్చిమిర్చీ, కొద్దిగా ఉప్పూ, సగం పసుపూ వేసి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి పల్లీలు వేయించాలి. రెండునిమిషాల తరవాత సెనగపప్పూ, మినప్పప్పూ, ఆవాలూ, ఎండుమిర్చీ, మిగిలిన పచ్చిమిర్చీ, కరివేపాకూ, ఇంగువా, మిగిలిన పసుపు వేసుకోవాలి. అన్నీ వేగాక కొద్దిగా ఉప్పూ, ముందుగా చేసుకున్న చింతకాయ ముద్ద కూడా వేయాలి. చింతకాయ కొద్దిగా వేగాక ఇందులో అన్నం వేసి బాగా కలపాలి. చివరగా తెల్ల నువ్వుల పొడి వేసి కలిపి ఓ గిన్నెలోకి తీసుకుంటే చాలు. నువ్వుల వాసన ఇష్టం లేనివారు....వేయించిన వేరుశెనగపప్పును బరకగా మిక్సీలో పట్టుకుని కలిపితే కొత్త రుచి వస్తుంది.

0 comments:

Post a Comment