Saturday, September 13, 2014

గ్రీన్ టీ విత్ తులసి

 '
 
·         కావలసినవి:
నీళ్లు - 2 కప్పులు; గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2; పంచదార - 2 టీ స్పూన్లు
·         తయారీ: 
నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది)
·         పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు.

* పుదీనా టీ

కావలసినవి:
పుదీనా ఆకులు - రెండు టీ స్పూన్లు; సోంపు - అర టీ స్పూను; ఎండు అల్లం - చిటికెడు
తయారీ
ఒక కప్పులో మరిగించిన నీళ్లు పోయాలి
పుదీనా ఆకులు, సోంపు, ఎండు అల్లం వేసి మూత ఉంచి ఐదు నిమిషాల తర్వాత వడ గట్టి తాగాలి.

Friday, September 12, 2014

పనీర్ బటర్ మసాల

కావలసినవి:
పనీర్ - 100 గ్రా, బటర్ - ఆరు టీ స్పూన్లు, క్రీమ్ - నాలుగు టీ స్పూన్లు, జీడిపప్పులు- పది, టొమాటో గుజ్జు - రెండు కప్పులు, ఉల్లిపాయలు- రెండు (సన్నగా తరగాలి), పసుపు, ఫుడ్ కలర్, ఏలకుల పొడి - చిటికెడు, కారం - రెండు టీ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూన్, ధనియాల పొడి- టీ స్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట
తయారి:
పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి. బాణలిలో బటర్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఏలకులపొడి, ఉల్లిపాయ తరుగు, ధనియాలపొడి, జీడిపప్పులు, పసుపు, ఉప్పు, కారం వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి అందులో టొమాటో గుజ్జు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత పనీర్ ముక్క లు, ఫుడ్ కలర్, క్రీమ్ వేసి స్టౌ మీద అయిదారు నిమిషాలు ఉడికించి దింపేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నీష్ చెయ్యాలి. పనీర్ బటర్ మసాలను రోటీస్‌లో కాని చపాతీలతో కాని తింటే చాలా బాగుంటుంది.

Monday, September 1, 2014

కుడుములు

కుడుములు 

కావలసినవి: 
బియ్యపు రవ్య - గ్లాసు; శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము - కప్పు; ఉప్పు - తగినంత 

తయారి: 
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత దించి, కొబ్బరి కలపాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్లలో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి.