కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం- 1/2, కప్పు, బియ్యం - 3/4 కప్పు, మినప్పప్పు - 1/4 కప్పు, మెంతులు - చిటికెడు, పెరుగు -3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు- 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, అల్లం తరుగు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లి తరుగు - కప్పు.
తయారుచేసే విధానం: సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి (అవసరమైతే కొద్ది నీరు వాడొచ్చు) 8 గంటల సేపు పక్కనుంచాలి. తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు, (5 గంటలపాటు నానబెట్టిన) శనగపప్పుని కలపాలి. చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి. వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించాలి. ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయి.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2015
(152)
-
▼
November
(23)
- హెల్దీ ఫ్రూట్ సలాడ్
- క్యారెట్ రైస్ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస...
- హెల్తీ అండ్ టేస్టీ మేతి టమోటో రైస్ బాత్ రిసిపి
- • మంచూరియా
- • ఉల్లికారం కూర
- చామదుంపలు పుట్నాల వేపుడు
- పొట్లకాయ మసాలా కర్రీ
- కాప్సికమ్ వేపుడు
- గోరు చిక్కుడు మసాలా కర్రీ
- సగ్గుబియ్యం పొంగనాలు
- సగ్గుబియ్యం కిచిడీ
- సగ్గుబియ్యం మురుకులు
- సగ్గుబియ్యం మురుకులు
- సగ్గుబియ్యం వడలు
- సగ్గుబియ్యం పకోడీ
- ఉల్లి మురుకులు
- ఉసిరి పెరుగు పచ్చడి
- ఉసిరి అన్నం
- • రాగి పులిహోర
- • సజ్జ నూనె పోలెలు
- • కొర్ర పాయసం
- వెజిటబుల్స్ ఊతప్పాలు
- ఉల్లిపాయ మజ్జిగ పులుసు:
-
▼
November
(23)
Sunday, November 15, 2015
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment